Interest Rates: FD కంటే ఇక్కడే లాభం! 8.2% వడ్డీ ఇచ్చే 6 ప్రభుత్వ పథకాలు.. మీ డబ్బుకు పక్కా భరోసా!
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎక్కడైనా సురక్షితంగా దాచుకోవాలని చూస్తారు. ఇలాంటి వారికి వెంటనే గుర్తొచ్చేవి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) లేదా రికరింగ్ డిపాజిట్లు (RD). అయితే, ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు (interest rates) కంటే ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Saving Schemes) చాలా మెరుగ్గా ఉన్నాయి. కేవలం వడ్డీ మాత్రమే కాదు, సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.
బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కడ ఎక్కువ లాభం ఉంది?
రిటర్న్స్ విషయానికి వస్తే, ఏప్రిల్ 2026 నాటికి ప్రధాన బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు (interest rates) సుమారు 6.25% నుండి 6.66% మధ్యలో ఉన్నాయి. కానీ ప్రభుత్వ పథకాలు ఏకంగా 8.2% వరకు వడ్డీని అందిస్తున్నాయి
వివిధ పథకాలు , బ్యాంకుల వడ్డీ రేట్లు (Interest Rates)..
లాక్-ఇన్ పీరియడ్ , ఫ్లెక్సిబిలిటీ
మీరు డబ్బును ఎక్కడ పెట్టాలి అనేది కేవలం వడ్డీ రేట్లు (interest rates) మీదే కాకుండా మీ అవసరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఎఫ్‌డీలలో ఒక వెసులుబాటు ఉంది.. మీకు అత్యవసరంగా డబ్బు కావాలంటే చిన్న పెనాల్టీతో ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.
కానీ ప్రభుత్వ పథకాలకు కొన్ని కచ్చితమైన గడువు (Lock-in period) ఉంటుంది..
- NSC: ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి 5 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోలేరు.
- PPF: ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్లాన్. పెళ్లిళ్లు లేదా పిల్లల చదువుల కోసం ఇది బెస్ట్.
- సుకన్య సమృద్ధి: ఆడపిల్లల కోసం చేసే ఈ పథకంలో అత్యధిక వడ్డీ లభిస్తుంది.
పన్ను ఆదా (Tax Benefits)
బ్యాంక్ ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ మీ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా ఉంటే, ఆ వడ్డీ మీద కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ PPF, NSC వంటి పథకాల్లో పెట్టే పెట్టుబడిపై రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, మీరు గరిష్టమైన వడ్డీ రేట్లు (interest rates) , పన్ను ఆదా కావాలని కోరుకుంటే ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు సరైన ఎంపిక. అలా కాకుండా, డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే సౌలభ్యం ఉండాలంటే బ్యాంక్ ఎఫ్‌డీలు ఎంచుకోవచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే మీ డబ్బు సురక్షితంగా పెరగడమే కాకుండా మీకు మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుంది.


Click it and Unblock the Notifications
