చాలా మంది తమ శాలరీ స్లిప్ చూసుకుని మురిసిపోతుంటారు. "నాకు నెలకు లక్షల్లో జీతం వస్తోంది, ఏదైనా బ్యాంక్‌లో పర్సనల్ లోన్ (Personal loan) అడిగితే వెంటనే ఇచ్చేస్తారు" అని ధీమాగా ఉంటారు. కానీ, తీరా లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంక్ ఆ అప్లికేషన్‌ను తిరస్కరిస్తుంది. అప్పుడు మనకు కలిగే సందేహం ఒక్కటే.. "అంత జీతం ఉన్నా నాకు లోన్ ఎందుకు ఇవ్వలేదు?" అని. నిజానికి బ్యాంకులు మీ జీతాన్ని మాత్రమే చూడవు, ఆ జీతంతో మీరు ఎలా బతుకుతున్నారు అనేది కూడా గమనిస్తాయి.

సంపాదన ఎంత కాదు.. మిగిలేది ఎంత?
మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. కానీ అందులో 80 వేలు ఇప్పటికే ఉన్న ఈఎంఐలు (EMIs), ఇంటి అద్దె, క్రెడిట్ కార్డ్ బిల్లులు , ఇతర ఖర్చులకు పోతుంటే.. మీ దగ్గర మిగిలేది కేవలం 20 వేలే. కొత్తగా పర్సనల్ లోన్ (Personal loan) ఇస్తే దానికి ఈఎంఐ కట్టే స్తోమత మీకు ఉందా లేదా అని బ్యాంక్ లెక్కగడుతుంది. మీ దగ్గర 'అందుబాటులో ఉన్న ఆదాయం' (Disposable Income) తక్కువగా ఉంటే, మీ జీతం ఎంత ఎక్కువగా ఉన్నా లోన్ రావడం కష్టమే.
గత ప్రవర్తన.. మీ వెంటే ఉంటుంది!
మీరు ఏడాది క్రితం ఏదైనా ఒక ఈఎంఐ కట్టడం మర్చిపోయారా? లేదా క్రెడిట్ కార్డ్ బిల్లును లేటుగా చెల్లించారా? మనకు ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ బ్యాంకుల దృష్టిలో ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. మీ జీతం ఈరోజు బాగుండవచ్చు, కానీ గతంలో మీరు అప్పులు ఎలా తీర్చారు అనే హిస్టరీని (Credit Score) బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ పాత చిన్న తప్పులే ఇప్పుడు మీ లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కావచ్చు.
క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడుతున్నారా?
మీకు క్రెడిట్ కార్డ్ ఉంది, మీరు దాని బిల్లులు కరెక్ట్‌గా కడుతున్నారు.. అంతా బాగుంది. కానీ, మీ కార్డుకున్న లిమిట్‌లో 80-90% ప్రతి నెలా వాడేస్తున్నారా? అయితే మీరు పూర్తిగా అప్పుల మీద ఆధారపడి జీవిస్తున్నారని బ్యాంక్ భావిస్తుంది. దీనినే 'క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో' అంటారు. ఇది ఎక్కువగా ఉంటే కొత్తగా మీకు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడతాయి.
పదే పదే జాబ్ మారుతున్నారా?
బ్యాంకులకు ఆదాయం కంటే 'స్థిరత్వం' (Stability) ముఖ్యం. మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంపెనీలు మారుస్తుంటే.. మీకు ఆదాయం స్థిరంగా వస్తుందని బ్యాంక్ నమ్మదు. అలాగే, మీరు పని చేసే రంగంలో అనిశ్చితి ఉన్నా బ్యాంకులు లోన్ ఇవ్వడానికి భయపడతాయి.
ఒకేసారి అన్ని చోట్లా ట్రై చేస్తున్నారా?
ఒక బ్యాంకులో లోన్ రిజెక్ట్ అవ్వగానే వెంటనే మరో మూడు నాలుగు బ్యాంకుల వెబ్‌సైట్లకు వెళ్లి అప్లై చేయడం పెద్ద తప్పు. మీరు ఎన్నిసార్లు లోన్ కోసం ఎంక్వైరీ చేసినా అది మీ క్రెడిట్ రిపోర్టులో కనిపిస్తుంది. మీరు అప్పు కోసం ఆతృతగా వెతుకుతున్నారని (Credit Hungry) అనిపిస్తే, బ్యాంకులు తమ రిస్క్ తగ్గించుకోవడానికి మీ లోన్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తాయి.
శాలరీ ఒక్కటే సరిపోదు!
మీ జీతం అనేది లోన్ పొందేందుకు ఒక ద్వారం లాంటిది మాత్రమే. కానీ ఆ ద్వారం దాటి లోపలికి వెళ్లాలంటే మీకు మంచి క్రెడిట్ స్కోరు, స్థిరమైన ఉద్యోగం , అప్పులను మేనేజ్ చేసే సామర్థ్యం ఉండాలి. కాబట్టి, లోన్ కోసం అప్లై చేసే ముందు మీ పాత బాకీలు తీర్చడం, సిబిల్ (CIBIL) స్కోరును మెరుగుపరుచుకోవడం వంటివి చేస్తే.. మీ శాలరీకి తగినట్లుగా సులభంగా లోన్ లభిస్తుంది. కేవలం సంపాదన పెంచుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications