కొత్త కారు కొనుగోలు కోసం నిధులు ఏర్పాటు చేసుకోవడంలో బ్యాంకు రుణం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ అందిస్తున్నాయి. ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు ముఖ్యంగా కస్టమర్ క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి. అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని మీరు భావిస్తున్నారా? కొత్త లాంచింగ్స్, ఆకర్షణీయ ఆఫర్స్ కారణంగా చాలామంది కొత్త సంవత్సరం తమ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి చేతులో పూర్తి మొత్తం డబ్బులు లేకుండా అందరూ కారు లోన్‌ను ఆశ్రయిస్తారు.

లోన్ మొత్తం నిర్ణయం
కారు లోన్ తీసుకునే సమయంలో ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కారు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు డౌన్ పేమెంట్ చేస్తారు. కారు కోసం కావాల్సిన మిగతా మొత్తాన్ని బ్యాంకులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన కారు రుణాన్ని కస్టమర్ వడ్డీతో పాటు కలిపి వాయిదాలలో చెల్లిస్తారు. మీ ఫండ్ అవసరాలు, నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి.

అందుబాటులో కారు రుణాలు
మీ వద్ద ముందుగా డబ్బు లేకపోయినా కారు లోన్ కలను నెరవేర్చడంలో మీకు సహాయపడతాయి. సహేతుకమైన వడ్డీ రేట్లతో కూడిన ఈఎంఐలు వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారందరికీ కారు రుణాలను అందుబాటులో ఉంచుతాయి. రుణ కాలపరిమితి విషయానికి వస్తే 5 ఏళ్ల వరకు ఎంచుకుంటారు. అయితే కొంతమంది తక్కువ ఈఎంఐ చెల్లింపుతో ఎక్కువ కాలపరిమితిని అంటే అయిదేళ్లకు మించి కాలపరిమితిని ఎంచుకుంటారు. చాలా బ్యాంకులు సౌకర్యవంతమైన కాలపరిమితితో రుణాలు అందిస్తాయి.

వివిధ బ్యాంకుల్లో కారు లోన్ రుణాలు
వివిధ బ్యాంకుల్లో రూ.10 లక్షల కారు రుణం తీసుకుంటే వడ్డీ రేటు ఇలా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.75 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 6.80 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.80 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం, ఎస్బీఐ 7.20 శాతం, సెంట్రల్ బ్యాంకు 7.25 శాతం, యూకో బ్యాంకు 7.25 శాతం, కెనరా బ్యాంకు 7.30 శాతం, ఐడీబీఐ బ్యాంకు 7.35 శాతం, యూనియన్ బ్యాంకు 7.40 శాతం, యాక్సిస్ బ్యాంకు 7.415 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 7.50 శాతం, యస్ బ్యాంకు 7.71 శాతం, HDFC బ్యాంకు 7.95 శాతంగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications