జూన్ లో ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్లు అలర్ట్.. ఈ చిన్న పొరపాట్లకు నోటీసులు రావడం ఖాయం!
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే సమయం వచ్చేసింది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 కి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జనాలు ఎలాంటి తప్పులు ఎక్కువగా చేస్తుంటారు? వాటి వల్ల రీఫండ్ ఏమైనా లేట్ అవుతుందా? అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) ని అడగ్గా.. అది కొన్ని షాకింగ్ , ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
ప్రస్తుతం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అంతా ఆటోమేటెడ్ సిస్టమ్స్ వాడుతోంది. మనం ఇచ్చే లెక్కలను మీ ఏఐఎస్ (AIS), ఫామ్ 26AS, టీడీఎస్ (TDS) రికార్డులతో కంప్యూటర్లే మ్యాచ్ చేస్తాయి. కాబట్టి చిన్న తప్పు జరిగినా ఐటీ నోటీసులు రావడం లేదా మీ రీఫండ్ డబ్బులు ఆగిపోవడం ఖాయం. చాట్‌జీపీటీ హెచ్చరించిన ఆ టాప్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

2026 లో అస్సలు చేయకూడని ఐటీఆర్ తప్పులు
- తప్పుడు ఐటీఆర్ (ITR) ఫామ్‌ను ఎంచుకోవడం: ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా క్యాపిటల్ గెయిన్స్ (లాభాలు) వచ్చినా, లేదా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు, విదేశీ ఆస్తులు ఉన్నా.. ఐటీఆర్-1 ఫైల్ చేయకూడదు. తప్పుడు ఫామ్ ఎంచుకుంటే మీ రిటర్న్‌ను 'డిఫెక్టివ్' (లోపభూయిష్టం) గా గుర్తిస్తూ నోటీస్ వస్తుంది.
- రికార్డులను సరిపోల్చకపోవడం (Reconciliation): కేవలం ఫామ్ 16 మాత్రమే చూసి ఐటీఆర్ ఫైల్ చేయకూడదు. మీ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, ఎఫ్‌డీ వడ్డీలు, డివిడెండ్ ఆదాయాలను ఏఐఎస్ (AIS), ఫామ్ 26AS లతో సరిచూసుకోవాలి. తేడాలు ఉంటే మీ రిటర్న్ ఫ్లాగ్ అవుతుంది.
- మరీ అంత త్వరగా ఫైల్ చేయడం! : సాలరీ తీసుకునే ఉద్యోగులు మే నెలలోనే కంగారుపడి ఫైల్ చేయకూడదు. కంపెనీ నుండి ఫామ్ 16 రాకముందే, లేదా టీడీఎస్ డేటా ఫామ్ 26AS లో అప్‌డేట్ అవ్వకముందే ఫైల్ చేస్తే మిస్‌మ్యాచ్ వస్తుంది. అందుకే టాక్స్ నిపుణులు జూన్ మిడ్ (మధ్య వారం) వరకు ఆగమని చెప్తుంటారు.
- ఇతర ఆదాయాలను దాచడం: బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, సైడ్ బిజినెస్ లేదా ఫ్రీలాన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్‌ను చాలామంది చూపించరు. కానీ బ్యాంకుల నుండి ఈ సమాచారం డైరెక్ట్‌గా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది కాబట్టి జాగ్రత్త!
- అర్హత లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం: సెక్షన్ 80C లేదా 80D (హెల్త్ ఇన్సూరెన్స్) కింద కంపెనీకి చూపించిన వాటి కంటే ఎక్కువ డిడక్షన్స్ సొంతంగా క్లెయిమ్ చేస్తే.. భవిష్యత్తులో టాక్స్ డిమాండ్ నోటీసులు వస్తాయి.
- తప్పుడు టీడీఎస్ (TDS) క్రెడిట్ క్లెయిమ్ చేయడం: చాట్‌జీపీటీ ప్రకారం ఈ ITR మిస్టేక్ చాలా డేంజర్. మీ ఫామ్ 26AS లో ఎంత టీడీఎస్ అమౌంట్ కనిపిస్తుందో అంతే క్లెయిమ్ చేయాలి. అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తే మీ రీఫండ్ ప్రాసెస్ ఘోరంగా ఆలస్యమవుతుంది, ఐటీ శాఖ నుండి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ రీఫండ్‌ను నేరుగా ఆపేసే డేంజర్ మిస్టేక్స్
మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్ డబ్బులు జెట్ స్పీడ్‌లో బ్యాంక్ అకౌంట్‌కు రావాలంటే ఈ క్రింది వాటిని పక్కాగా చూసుకోవాలి.
- బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్: మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్ తప్పుగా ఉన్నా, లేదా అకౌంట్ క్లోజ్ అయినా రీఫండ్ ఫెయిల్ అవుతుంది. ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్ ముందే 'ప్రీ-వాలిడేట్' అయి ఉండాలి.
- ఈ-వెరిఫికేషన్ (e-Verification) చేయకపోవడం: ఐటీఆర్ సబ్మిట్ చేసినంత మాత్రాన పని అయిపోలేదు. నిర్దేశిత రోజుల్లోగా ఆధార్ ఓటీపీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లేదంటే మీరు ఐటీఆరే ఫైల్ చేయనట్లుగా పరిగణిస్తారు.
- పాన్-ఆధార్ లింకింగ్ సమస్యలు: ఆధార్ కార్డ్‌తో లింక్ అవ్వకపోవడం వల్ల మీ పాన్ (PAN) కార్డ్ గనుక ఇన్‌ఆపరేటివ్ (పనిచేయకుండా) అయితే.. రీఫండ్ డబ్బులను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టేస్తుంది.
సబ్మిట్ చేసే ముందు ఈ సింపుల్ చెక్‌లిస్ట్ ఫాలో అవ్వండి..
• AIS , ఫామ్ 26AS చెక్ చేశారా?
• అన్ని బ్యాంక్ ఇంట్రెస్టులు, డివిడెండ్లు రిపోర్ట్ చేశారా?
• కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారా?
• రీఫండ్ వచ్చే బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ అయి ఉందా?
• ఫైలింగ్ పూర్తి కాగానే వెంటనే ఈ-వెరిఫికేషన్ ఆన్ చేశారా?
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఎలాంటి ఐటీ నోటీసులు లేకుండా, టెన్షన్ పడకుండా మీ రీఫండ్ డబ్బులు మీ అకౌంట్‌లో పడిపోతాయి!


Click it and Unblock the Notifications