కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(HBA) సంబంధిత ప్రయోజనాలను మరింతకాలం పొడిగించింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది భారీ ఊరట అని చెప్పవచ్చు. సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు HBA కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిన విషయం తెలిసిందే. వేతనాల కోత, ఉద్యోగాల కోత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డారు.

HBA కోసం దరఖాస్తు
సొంతింటిని నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు HBA కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. HBA 2020 అక్టోబర్ 1వ తేదీ నుండి 2022 మార్చి 31వ తేదీ వరకు మొత్తం 18 నెలల వరకు అందుబాటులో ఉంది.
వడ్డీ రేటు 7.9 శాతం నుండి ప్రారంభమవుతోంది. HBAపై వడ్డీ రేటు గృహ నిర్మాణానికి రుణం తీసుకున్న మొత్తంపై పదేళ్ల జీ-సెక్ యీల్డ్స్‌కు సంబంధించినది. ఏడో వేతన సవరణ సంఘం ఆమోదించిన నిబంధనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం HBA మార్గదర్శకాలను నవీకరించింది.

ఇంటి కొనుగోలు కోసం HBA
ఏడో వేతన సంఘం పే-మెట్రిక్స్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే HBA నిబంధనలను అప్‌డేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, అలాగే అయిదేళ్లకు పైబడి సర్వీస్ కలిగిన తాత్కాలిక ఉద్యోగులు ఇంటి కొనుగోలు కోసం HBA కింద రుణాన్ని తీసుకోవచ్చు. ఉద్యోగులు HBAను కింది కారణాలతో ఉపయోగించుకోవచ్చు.

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్
- ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి స్థలం లేదా భూమిపై కొత్త ఇంటి నిర్మాణం కోసం.
- ప్లాట్ కొనుగోలు, అక్కడ భవన నిర్మాణం.
- కోఆపరేటివ్ స్కీం కంద ప్లాట్ కొనుగోలు చేయడం, ఇంటిని నిర్మించడం. కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడం కోసం.
- ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన ఇంటి పునర్నిర్మాణం కోసం.
- బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి హోమ్ లోన్ పొందిన ప్రస్తుత ఉద్యోగులు వీటలో చేరడానికి అర్హులు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications