మీరు ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు ? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కొంత మంది చాల కారణాల వల్ల డబ్బు వాడడానికి ఇంకా దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే పన్ను ఎగవేత, నల్లధనాన్ని నిరోధించేందుకు ఆదాయపు పన్ను శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇంట్లో డబ్బు ఉంచడం ఇంకా దాచడం దాని చుట్టూ ఉన్న నిబంధనల గురించి మీరు తెలుసా...
మీరు ఇంట్లో డబ్బు పెట్టుకోవచ్చా?
ఆదాయపు పన్ను నియమాలు మీరు ఇంట్లో ఉంచుకునే డబ్బు పై పరిమితిని పేర్కొనలేదు. అయితే మీరు ఆ డబ్బుకు ఆధారాలు తప్పనిసరిగా వివరించాలీ. ITR డిక్లరేషన్ వంటి సరైన డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న డబ్బుకు మ్యాచ్ అవ్వాలి. డబ్బు చట్టబద్ధంగా సంపాదించి, ప్రకటించితే ఆ డబ్బుతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడు చర్యలు తీసుకుంటుందంటే ?
విచారణ సమయంలో మీరు మీ దగ్గర ఉన్న డబ్బుకు ఆధారాలు చూపించలేకపోతే సమస్యలకు దారితీయవచ్చు:

అధికారుల విచారణ:
*నగదు చట్టబద్దమైనదేనా అని ఏజెన్సీలు ప్రశ్నించవచ్చు.
*ఆదాయపు పన్ను శాఖ మీ పన్ను వివరాలు ఇంకా ఖర్చులను సమీక్షిస్తుంది.
వెల్లడించని నగదు పై జరిమానాలు:
మీరు వెల్లడించని నగదు మొత్తంలో 137% వరకు పన్ను అలాగే పెనాల్టీల రూపంలో రికవరీ చేయవచ్చు.
క్యాష్ ట్రాన్సక్షన్ పై ఇతర నియమాలు
ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ నగదు విత్ డ్రాల కోసం మీరు తప్పనిసరిగా మీ పాన్ కార్డ్‌ని అందించాలి .
పెద్ద విత్‌డ్రాలపై TDS:
*ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N కింద మీరు విత్ డ్రా చేసుకుంటే TDS వర్తిస్తుంది.
*సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ: నాన్-ITR ఫైల్ చేసేవారికి 2% TDS (గత 3 సంవత్సరాలు).
*సంవత్సరానికి రూ.1 కోటి కంటే ఎక్కువ: నాన్-ITR ఫైల్ చేసేవారికి 5% TDS; ITR ఫైల్ చేసేవారికి 2% TDS.
*ITR ఫైల్ చేసేవారు TDS లేకుండా సంవత్సరానికి రూ.1 కోటి వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో నగదు లావాదేవీలు:
ఒకేసారి రూ.1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే విచారణకు దారితీయవచ్చు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ వస్తువులను కొనడం.
పాన్ అండ్ ఆధార్ రెండూ సబ్మిట్ చేస్తే తప్ప రూ.2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్స్ నిషేధం.
చివరగా మీరు మీ ఇంట్లో ఎంత డబ్బు అయినా ఉంచుకోవచ్చో దీనికి ఎలాంటి పరిమితి లేదు, కానీ ఆ డబ్బుకు సరైన అధరాలు ఉండాలి. ఎక్కువ మొత్తంతో లేదా అధరాలు లేని డబ్బు పై విచారణలు, జరిమానాలు ఇంకా అదనపు పన్ను రికవరీకి దారి తీయవచ్చు. చట్టపరమైన అలాగే ఆర్థిక సమస్యలను ఎదురుకోకుండా ఉండాలంటే నగదు లావాదేవీల నియమాలను అనుసరించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications