వ్యాపారం చేయాలనీ చూస్తున్నారా..ఎ వ్యాపారం చేయాలో తెలియట్లేదా అయితే మంచి రాబడి ఇచ్చే ఒక బిజినెస్ ఐడియా మీకోసం. ఈ రోజుల్లో ఉద్యోగంతో వచ్చే జీతంలో కుటుంబం మొత్తం గడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, పిల్లలను పోషించడానికి ఇంట్లో ఒక్కరి జీతం సరిపోదు. వ్యాపారం ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశాలు చాల ఎక్కువ. పైగా మీ పెట్టుబడికి డబుల్ పంపాదించే మార్గాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియాకి మీకో కొంచెం స్థలం ఉంటె చాలు. మీకు ఒక ఎకరం భూమి ఉంటే ఈ పంట పండించి లక్షల్లో సంపాదించవచ్చు. మీరు మీ సొంత ఊర్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఈ వ్యాపారం చేస్తూ లక్షాధికారి కావొచ్చు కూడా. అయితే ఇప్పుడు మార్కెట్లో చాలా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక కొత్త పంట గురించి చూదాం...
మీరు ఏదైనా కొత్త వ్యవసాయ ఆలోచన కోసం చూస్తున్నట్లయితే, యాలకుల పంట పెంపకం వ్యాపారం మంచి అప్షన్ అని చెప్పవచ్చు. యాలకులు చక్కటి లాభదాయకమైన పంట. కేరళలో పెద్ద సంఖ్యలో రైతులు దీనిని పండిస్తారు. దీనికి దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ సీజన్‌లో యాలకులు పండిస్తే రైతులకు మంచి లాభాలను ఆర్జించవచ్చు. భారతదేశంలో యాలకులను పెద్ద ఎత్తున ఒక వాణిజ్య పంటగా సాగు చేస్తారు. మన దేశంలోని రైతులు యాలకులను పండిస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. మీరు కూడా యాలకులను పండించాలనుకుంటే జస్ట్ ఈ విధంగా స్టార్ట్ చేయవచ్చు.

భారతదేశంలో యాలకులను ప్రధానంగా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు రాష్ట్రాలలో సాగు చేస్తారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా యాలకులకు మంచి డిమాండ్ ఉంది. ఆహారం, స్వీట్లు, పానీయాల తయారీలో యాలకులను ఉపయోగిస్తారు. తీపి పదార్థాలకు రుచి, సువాసనను అందించడంలో యాలకులు ఉపయోగపడుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ పంటకు అనుకరించగలవు. యాలకుల సాగుకుకి మన రాష్ట్ర నేల అనుకూలంగా భావిస్తారు. ఈ పంటని నల్ల రేగడి నేలలో పండిస్తారు. యాలకుల సాగుకి మంచినీటి వ్యవస్థ ఉండాలి. ఇసుక నేలలో యాలకుల సాగు అంత లాభదాయకం కాదు. యాలకుల సాగుకు 10 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత మంచిదని చెబుతారు.
యాలకుల మొక్క కాండం ఒకటి నుండి రెండు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు 30 నుండి 60 సెంటీమీటర్లు వెడల్పు ఐదు నుండి తొమ్మిది సెంటీమీటర్లు ఉంటుంది. మీరు మీ పొలం సరిహద్దులలో యాలకుల మొక్కలను నాటాలనుకుంటే, మీరు వాటిని రెండు నుండి మూడు అడుగుల దూరంలో నాటి తవ్విన గుంతలో మంచి ఎరువులు వేయాలి. ఇప్పుడు ఈ మొక్కలు దిగుబడి ఇవ్వడానికి మూడు నుండి నాలుగు సంవత్సరాలు పడుతుంది. పంట కోసిన తర్వాత, పంటను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టవచ్చు లేదా మీరు ఏదైనా యంత్రాన్ని ఉపయోగించవచ్చు. దీనిని 18 నుండి 24 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఈ పంటను ఎక్కువగా వర్షాకాలంలో పండిస్తారు. సాధారణంగా భారతదేశంలో పంటలను జూలై నెలలో నాటుతారు. ఈ సమయంలో నీటి అవసరం తక్కువగా ఉంటుంది. ఈ మొక్కలను నీడలోనే నాటాలి, అధిక సూర్యకాంతి ఈ పంట దిగుబడిని తగ్గిస్తుంది.
యాలకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు మొక్కను చేతితో లేదా కొబ్బరి చాపతో రుద్దుతారు. తరువాత దానిని ఆకారం ఇంకా రంగు ప్రకారం వేరు చేస్తారు. వీటిని మార్కెట్లో అమ్మడం ద్వారా మీరు చాలా సంపాదించవచ్చు. మీరు ఎకరానికి 175 నుండి 150 కిలోల దిగుబడిని పొందవచ్చు. మార్కెట్ వీటి ధర కిలోకు రూ.1100 నుండి రూ.2000 ఉంటుంది. ఇలా మీరు ఎకరాకు ఐదు నుండి ఆరు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే మార్కెట్ ప్రకారం ఒకోసారి కిలోకి రూ.3000 దాకా పలకవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications