హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, కెనరా బ్యాంకు అదిరిపోయే ఆఫర్

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కెనరా బ్యాంకు మీకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వడ్డీ రేట్లు దశాబ్దాం లేదా దశాబ్దంన్నర కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు వివిధ బ్యాంకులు పండుగ వంటి ప్రత్యేక సమయాల్లో వడ్డీ రేటును మరింత తగ్గించాయి. పర్సనల్ లోన్ నుండి హోమ్ లోన్ వరకు వడ్డీ రేట్లపై ఆఫర్లు అందించాయి. ప్రయివేటు నుండి ప్రభుత్వరంగ బ్యాంకు వరకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఏడు శాతం దిగువకు పడిపోయాయి. కెనరా బ్యాంకు తాజాగా హోమ్ లోన్ పైన మరింత వడ్డీ రేటును తగ్గించింది. పరిమిత కాల వ్యవధి పాటు వర్తించే ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్స్ పైన 6.65 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ మేరకు శనివారం వెల్లడించింది.

ఆ లోన్లకు కూడా వర్తిస్తుంది

ఆ లోన్లకు కూడా వర్తిస్తుంది

ప‌రిమిత కాల ఆఫ‌ర్‌ను వినియోగించుకునే మంచి అవ‌కాశం బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చిందని కెనరా బ్యాంకు ఓ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌డం ద్వారా ఆన్‌లైన్‌లోను క‌స్ట‌మ‌ర్లు హోమ్ లోన్ కోసం రిక్వెస్ట్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఆన్‌లైన్ స‌దుపాయం ద్వారా క‌స్ట‌మ‌ర్లు ఇన్‌స్టాంట్ అప్రూవ‌ల్ పొంద‌వ‌చ్చ‌ునని వెల్లడించింది. ిది పరిమిత కాల ఆఫర్ కాబట్టి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. హోమ్ లోన్ కావాలనుకునే వారు వెంటనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌక‌ర్యం కారు లోన్, ఎడ్యుకేష‌న్ లోన్, గోల్డ్ లోన్, ప‌ర్స‌న‌ల్ లోన్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.

ప్రాసెసింగ్ ఫీజు లేదు

ప్రాసెసింగ్ ఫీజు లేదు

ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని కెనరా బ్యాంకు ట్వీట్ చేసింది. డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవని, ఆకర్షణీయ వడ్డీ 6.65 శాతంతో హౌసింగ్ లోన్ అందిస్తున్నట్లు పేర్కొంది. షరతులు వర్తిస్తాయని కూడా పేర్కొంది.

హోమ్ లోన్ లేదా వెహికిల్ లేదా ఎడ్యుకేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ కావాలనుకునే వారు https://canarabankcsis.in/retail/Main.aspx ఈ లింక్‌లోకి వెళ్ళి దరఖాస్తు చేయవచ్చు.

మరింత సమాచారం కోసం 425 0018, 1800 103 0018 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

బ్యాంకుల వడ్డీ రేటు తగ్గింపు

బ్యాంకుల వడ్డీ రేటు తగ్గింపు

నవంబర్ చివరి వరకు బ్యాంకులు దీపావళి సందర్భంగా వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఇప్పటికే పలు బ్యాంకుల వడ్డీ రేటు కాల పరిమితి ముగిసింది. కొన్ని బ్యాంకుల కాలపరిమితి మరికొంతకాలం ఉంది లేదా పొడిగించాయి. తాజాగా కెనరా బ్యాంకు ఆఫర్ అందిస్తోంది. పలు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాయి. డాక్యుమెంటేషన్ ఛార్జీలను కూడా తీసుకోవడం లేదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+