ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి. తాజాగా సవరించిన వడ్డీ రేటు ప్రకారం ఏడాది లోపు డిపాజిట్ పైన 5.1 శాతానికి, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.15 శాతానికి పెరిగింది. ఈ రెండు డిపాజిట్స్ పైన ప్రస్తుతం వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.20 శాతానికి, 3-5 సంవత్సరాల ఎఫ్‌డీపై 5.45 శాతానికి పెంచారు. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు గరిష్టంగా 0.25 శాతం నుండి 5.5 శాతానికి పెరిగింది.
సీనియర్ సిటిజన్స్‌కు అన్ని కాలపరిమితిలపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. కెనరా బ్యాంకు మొదటిసారి రూ.1000 కోట్లు, ఆపై డిపాజిట్ల పైన కొత్త స్లాబ్‌ను తీసుకు వచ్చింది. ఈ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీని అందించనున్నట్లు తెలిపింది. కెనరా యూనిక్ కింద రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై 5.55 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

కరోనా తగ్గుదల నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతున్నాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్స్ దశాబ్దంన్నర కనిష్టం వద్ద ఉన్నాయి. ఇటీవల కరోనా తగ్గడంతో రుణ వితరణలు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు లిక్విడిటీ కోసం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications