తీవ్ర అస్థిరతలో స్టాక్ మార్కెట్లు, అగ్రెసివ్‌గా ఉండవచ్చునా?
స్టాక్ మార్కెట్లు గతవారం స్వల్ప లాభాల్లో ముగిసినప్పటికీ, గత కొంతకాలంగా అస్థిరంగా కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ గతవారం అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. నిఫ్టీ అంతేస్థాయిలో క్షీణించింది. సాధారణంగా మార్కెట్ డిప్‌లో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లు అస్థిరంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఇంధన ధరల ఊగిసలాట, ద్రవ్యోల్బణ ఆందోళనలు, జాబ్ మార్కెట్ అనిశ్చితి, చైనాలో కరోనా అనిశ్చితుల మధ్య సూచీలు పైకి, కిందకు కదలాడుతున్నాయి.
మార్కెట్లు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,600. ప్రస్తుతం 16,600 దిగువన ఉంది. అంటే దాదాపు 2000 పాయింట్ల క్షీణతతో ఉంది. మరింత కాలం నిఫ్టీ 16,900 నుండి 17,200 మధ్య కాలంలోనే ఎక్కువగా కదలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య నిరోధకం ఉండవచ్చునని, కాబట్టి అగ్రెసివ్‌గా వెళ్ళడంపై ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.

మే 2022 మొదటి అర్ధ మాసంలో బేర్ పై చేయి సాధించింది. అమ్మకాల ఒత్తిడితో 16000 పాయింట్ల దిగువకు వచ్చిన నిఫ్టీ, దాదాపు 15670 పాయింట్ల వద్ద పరీక్షను ఎదుర్కొంది. అయితే మే ద్వితీయార్ధంలో కాస్త సానుకూలత పెరిగింది. ఇండెక్స్ కనిష్టస్థాయి నుండి దాదాపు 1000 పాయింట్లు లాభపడింది. అయితే ఏప్రిల్ నెల ముగింపు నుండి దాదాపు 3 శాతం కోల్పోయింది.


Click it and Unblock the Notifications