ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవోకు వస్తుంది. ఐపీవో తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసీ ఐపీవోకు కోట్లాదిమంది వేచి చూస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఎంతోమంది. అలాంటి ఎల్ఐసీ ఐపీవోలో పాలసీదారులకు పది శాతం రాయితీ ఉంది. అయితే ఇక్కడ పాలసీదారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ల్యాప్స్ అయిన పాలసీకి డిస్కౌంట్ వర్తిస్తుందా, జాయింట్ ఎల్ఐసీ పాలసీదారులు డిస్కౌంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? అనే ప్రశ్నలు ముందున్నాయి.

ల్యాప్స్ అయినా డిస్కౌంట్‌కు అర్హులు
ల్యాప్స్ అయిన పాలసీదారు కూడా ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొని, పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలుస్తోంది. ఎల్ఐసీ డీఆర్‌హెచ్‌పీ ప్రకారం పాలసీదారు మెచ్యూరిటీ లేదా సరెండర్ లేదా మరణం ద్వారా రికార్డ్స్ నుండి నిష్క్రమించని అన్ని పాలసీలు కూడా పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద డిస్కౌంట్‌కు అర్హులు అని తెలుస్తోంది.

పాన్ నెంబర్ అప్ డేటేషన్
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌లో పాలుపంచుకోవాలని భావించే పాలసీదారులు తమ పాన్ వివరాలను కార్పోరేషన్స్ రికార్డ్స్‌లో అప్ డేట్ చేయాలి. అప్పుడు మీరు ఏదైనా పబ్లిక్ ఆఫర్‌లో సభ్యత్వానికి సాధ్యమవుతుంది. అలాగే, చెల్లుబాటు అయ్యే డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. పాలసీదారు ఎల్ఐసీ పోర్టల్‌లో పాన్ నెంబర్‌ను అప్ డేట్ చేయాలి. ఫిబ్రవరి 28, 2022 నాటికి పాన్ అప్ డేట్ చేసి ఉండాలి. పాలసీదారులు డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి.

గ్రూప్ ప్లాన్స్
గ్రూప్ ప్లాన్స్ కింద ఉన్నవారిని మినహాయించి అందరు పాలసీదారులు పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద ఐపీవో కోసం వేలంలో పాల్గొనడానికి అర్హులు అని తెలుస్తోంది. ఐపీవో ద్వారా ఆఫర్ చేయబడిన మొత్తం షేర్లలో పది శాతం వరకు అర్హత కలిగిన ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేస్తారు.


Click it and Unblock the Notifications