ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. మార్కెట్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా రకరకాల క్రెడిట్ కార్డ్స్ అఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కడైనా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ క్రెడిట్ ద్వారా చేయవచ్చు. క్రెడిట్ కార్డ్స్ ఉద్యోగం చేసే వారికి మాత్రమే కాదు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా లభిస్తుంటుంది. అయితే ఇంట్లో ఉండే మహిళలు కూడా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా అనే డౌట్ కొందరికి ఉండొచ్చు. అయితే గృహిణిలు కూడా క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేయవచ్చా అంటే ? సమాధానం, అవును. గృహిణులు కూడా వారి పేరు మీద క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. దీనికి బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు కొన్ని షరతులు, నియమాలు విధించారు. వీటిని అనుసరించి ఏ గృహిణి అయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.
IDFC ఫస్ట్ బ్యాంక్ ప్రకారం, క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసే సమయంలో ఒక గృహిణికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే ఆమె భారతీయ పౌరురాలై ఉండాలి. క్యుములేటివ్, రీఇన్వెస్ట్‌మెంట్, ఆటో రెన్యూవల్ మోడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ (FD ఖాతా) ఉండాలి. క్రెడిట్ కార్డ్స్ గృహిణులకు ఆర్థిక స్వేచ్ఛను ఇంకా సేవింగ్స్ పెంచుకునే అవకాశం అందిస్తాయి.

అలాగే, ఆమె రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్‌లతో ఈజీగా షాపింగ్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ మీ FD వాల్యూలో 100% కనీస క్రెడిట్ లిమిట్ అందిస్తుంది అలాగే మీ FD వాల్యూలో 200% వరకు ఉండవచ్చు.
యాడ్-ఆన్ కార్డ్ లేదా సేఫ్ కార్డ్
గృహిణులకు క్రెడిట్ కార్డు అర్హత కార్డు రకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక గృహిణి భర్త క్రెడిట్ కార్డ్ లింక్ చేసి యాడ్-ఆన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భర్త ఆదాయం యాడ్-ఆన్ కార్డ్ క్రెడిట్ లిమిట్ నిర్ణయిస్తుంది. రెండవది గృహిణులు ఫిక్సెడ్ డిపాజిట్ల (FDలు) ద్వారా సేఫ్ కార్డ్స్ పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్రెడిట్ లిమిట్‌కి సెక్యూరిటీగా పనిచేస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డ్‌లు కనీస ఆదాయంతో ఉంటాయి, ఇవి క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవడానికి అల్టార్నేటివ్ ఇన్ కం సోర్సెస్ గా కూడా చూపుతాయి.
క్రెడిట్ కార్డ్‌తో మీరు ఇప్పుడు ఏదైనా కొన్న తర్వాత డబ్బులు తరువాత కూడా కట్టే ఫెసిలిటీ పొందవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతగా ఉపయోగిస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇందులో ఎంత అజాగ్రత్తగా ఉంటే, అంత ఎక్కువ ఆర్థిక భారాన్ని కూడా పెంచుతుంది, ఎందుకంటే మీరు సరైన టైంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మీరు దానిపై ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications