కోటీశ్వరుడు కావడం అనేది చాలా మందికి పెద్ద లక్ష్యంగా ఉంటుంది. అయితే, ఇది సాధ్యమే కానీ కొంత క్రమశిక్షణ, స్థిరత్వం మరియు తెలివైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. SIP (Systematic Investment Plan) ద్వారా కోటి రూపాయలు కూడగట్టడం సాధ్యమే అయినా, కొన్ని వాస్తవాలను తెలుసుకోవాలి.

SIPలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు) ఇప్పుడు ఉద్యోగులు, ముఖ్యంగా యువతలో ఓ సులబమైన పెట్టుబడి సాధనంగా మారిపోయాయి. నెలకు కొన్ని వందలు నుంచి ప్రారంభించి, సంవత్సరాల పాటు జాగ్రత్తగా పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తాన్ని సులభంగా కూడగట్టవచ్చు. దీన్ని ఒక జీతదారుడి ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా, సరైన ఆస్తి కేటాయింపుతో కలిపి చూస్తే, ఇది నిజంగా తెలివైన పెట్టుబడి మార్గం.
కానీ SIPలు ఎప్పుడూ భద్రమైన లేదా అధిక రాబడులు ఇస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుందో, మీరు ఎంచుకున్న ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో బట్టి ఫలితాలు మారవచ్చు. అయినా, ఒకే ఫండ్‌లో నెలకు ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ ముందుకెళ్తే, కాలక్రమంలో లక్షల, కోటి రూపాయల టార్గెట్‌ను కూడా చేరే అవకాశం ఉంటుంది కానీ అంతా స్థిరత, కాలపరిమితి, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
మనీ మంత్రా వ్యవస్థాపకుడు వైరల్ భట్ చెబుతున్న విషయాలు ప్రకారం చాలా మంది ఉద్యోగులు, కొత్తగా పెట్టుబడి చేయాలనుకునే వారికి ఈ SIPలు ఉపయోగపడతాయి. ఆయన చెప్పే ఓ స్పష్టమైన విషయం ఏంటంటే "ధనవంతుడు కావాలంటే పెద్ద మొత్తాలే అవసరం లేదు. చిన్న మొత్తాలనే సరిపోతాయి కానీ వాటిని క్రమంగా, ఓ సిస్టమాటిక్ విధానంలో పెట్టుబడి చేస్తే."
అయితే కేవలం పెట్టుబడి చేయడం ఒకటే కాదని, స్తిరత్వం, క్రమశిక్షణ, ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత కూడా అవసరమని ఆయన హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకి, నెలకు రూ. 5,000 SIP చేస్తే, 20 ఏళ్లలో దాదాపు రూ. 50 లక్షల వరకూ చేరొచ్చు. ఇది పెద్ద మొత్తమే అయినా, కానీ కోటి లక్ష్యం అయితే ఇంకొంచెం స్ట్రాటజీ మారాలి.
ఈ విషయంలో భట్ రెండు మార్గాలు సూచిస్తున్నారు: ఒకటి, మొదటి నుంచే రూ. 10,000 SIPతో స్టార్ట్ చేయాలి. రెండవది, రూ. 5,000తో మొదలుపెట్టి, ప్రతి ఏడాది SIP మొత్తాన్ని పెంచుతూ వెళ్లాలి. ఇది 'స్టెప్-అప్ SIP' అంటారు. అంటే, మీ జీతం పెరిగితే పెట్టుబడిని కూడా తగిన విధంగా పెంచాలి. ఈ అలవాటు సుదీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.
కానీ చాలా మంది మధ్యలోనే ఆగిపోతుంటారు. జీతం పెరిగినా SIP పెట్టుబడి డబ్బుని మార్చరు, మార్కెట్ పడిపోతే SIP ఆపేస్తారు. ఈ తప్పులే లక్ష్యాలకు అడ్డుగోడలవుతాయి. SIP అనేది కేవలం ఫైనాన్షియల్ టూల్ కాదు అది ఒక అలవాటు. మీరు ఎంత నిబద్ధతగా, స్టెడీగా పెట్టుబడి చేస్తారో, అంతకు తగ్గ ఫలితం మిమల్ని ముందుకు తీసువెళ్తుంది.
వైరల్ భట్ సూచనల ప్రకారం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రారంభించండి. ప్రతి సారి జీతం పెరుగుదలతో పాటు SIP మొత్తాన్నికూడా పెంచుకోండి. మీ పెట్టుబడి ప్రణాళికను ప్రతి ఏడాది ఒకసారి రివ్యూ చేస్తూ ఉండాలి. ఈ మూడు చిట్కాలు పాటిస్తే, 20 ఏళ్లలో మీ ఖాతాలోని నంబర్లలో కోటి కనిపించడానికి ఏ అడ్డంకీ ఉండదు. ఓ సింపుల్ అలవాటుతో మీరు పెద్ద లక్ష్యాన్ని చేరవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications