స్టాక్ మార్కెట్లు మంగళవారం(సెప్టెంబర్ 7) ప్రారంభంలో భారీగా నష్టపోయాయి. దీంతో మార్కెట్లో కరెక్షన్ (దిద్దుబాటు) ప్రారంభమైనట్లుగా కనిపించింది. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా మూడు సెషన్‌లలో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను సృష్టించాయి. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్లు ఎగిసిపడటం కలిసి వచ్చింది. రెండు సూచీలు కూడా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ సంకేతాల సానుకూలత, ఐటీ, రియల్టీ షేర్లకు లభించిన మద్దతుతో మార్కెట్ ర్యాలీ కొనసాగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ హెవీ వెయిట్ సాయంతో సూచీలు సరికొత్త రికార్డుకు చేరుకున్నాయని, విస్తృత మార్కెట్లో బలహీనత కనబడుతోందని అంటున్నారు.

అందుకే చిన్న స్టాక్స్ వైపు
స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లకు చిన్న షేర్లు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి. సూచీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకడంలో హెవీ వెయిట్స్ పాత్ర ఉండటంతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి.. ఎంపిక చేసుకొని, పలు చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆగస్ట్ చివరి నాటికి బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 6,270 పాయింట్లు లేదా 30 శాతానికి పైగా లాభపడి 26,919.94 పాయింట్లకు చేరుకుంది. మిడ్ క్యాప్ సూచీ 3,672 పాయింట్లు లేదా 18 శాతానికి పైగా లాభపడి 23,853 వద్ద ఉంది. 30 షేర్స్ కలిగిన బ్లూచిప్ కంపెనీల సూచీ సెన్సెక్స్ గత అయిదు నెలల కాలంలో 8,043 పాయింట్లు లేదా 16 శాతానికి పైగా ఎగిసిపడింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, థర్డ్ వేవ్ ఆందోళనలు కాస్త తగ్గడం మార్కెట్ సెంటిమెంటును బలపరుస్తోంది. దేశంలో రిటైల్ లేదా తక్కువ పెట్టుబడి పెడుతోన్న ఇన్వెస్టర్లు రోజురోజుకు పెరుగుతున్నారు. వీరిలో చాలామంది తక్కువ పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. నష్టపోతే తక్కువే నష్టపోతాం.. లేదంటే వస్తాయి అనే ఆలోచన చాలామందిలో ఉంది. అందుకే చిన్న స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. తక్కువ పెట్టుబడితో వీలైనన్ని ఎక్కువ షేర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

గత ఏడాది ఎలా పెరిగాయంటే
ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, ఎగుమతులు, ఈ-వే బిల్స్, పన్నుల చెల్లింపులు, ఆటో అమ్మకాలు పెరగడం, దేశ జీడీపీ అంచనాలు సానుకూలంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా సంస్థాగతేతర ఇన్వెస్టర్లు మార్కెట్ ట్రాన్సాక్షన్స్‌లో పెరిగారు. గత ఆర్థిక సంవత్సరం బీఎస్ఈ స్మాల్ క్యాప్ 11,040 పాయింట్లు లేదా 114 శాతం పెరగగా, మిడ్ క్యాప్ 9,611 పాయింట్లు లేదా 91 శాతం ఎగిసింది. సెన్సెక్స్ 20,040 పాయింట్లు లేదా 68 శాతం లాభపడింది. ఒకే ఒక హెవీ వెయిట్ సంస్థ వ్యాల్యూలో మిడ్ క్యాప్ ఐదో వంతు, స్మాల్ క్యాప్ 10వ వంతుగా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ వరకు స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఎలారా సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజూ శ్యామ్యూల్ అన్నారు. ప్రస్తుతం నిఫ్టీ 17,400 పాయింట్లకు పైన ఉందని ఇది 19000 పైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ స్టాక్స్ 5 శాతం జంప్
నేటి ప్రారంభ సెషన్‌లో టీ, కాఫీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరిగాయి. టాటా కాఫీ, లాంగ్‌వ్యూ టీ కంపెనీ, మెక్‌లాడ్ రసెల్ గెయినింగ్ స్టాక్స్ ఐదు శాతం నుండి 3 శాతం వరకు లాభపడ్డాయి. ఇక, బన్సి సన్స్ టీ, జేమ్స్ వారెన్ టీ, లేడో టీ, లిక్స్ వంటి స్టాక్స్ మత్రం 2 శాతం నుండి 5 శాతం క్షీణించాయి. నోర్బెన్ టీ 8 శాతానికి పైగా నష్టపోయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications