క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం: తెలివైన ఎంపికా? లేక నష్టమా?

ఈ రోజుల్లో బంగారం కొనడమే కాదు, దానిని కొనుగోలు చేసే విధానం కూడా మారిపోయింది. నగదు లేకున్నా, ఖర్చు ఎక్కువైనా, చాలామంది క్రెడిట్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. ప్రత్యేకించి పెళ్లిళ్లు, పండగలు, గిఫ్ట్‌ల కోసం బంగారం తీసుకోవాలనిపించినప్పుడు... చేతిలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు ఒక్కదాని మీదే ఆశ పెట్టుకుంటారు. అయితే బంగారం లాంటి విలువైన వస్తువులను క్రెడిట్ కార్డ్‌తో కొనాలంటే కొన్ని కీలకమైన విషయాలు ముందే తెలుసుకోవాలి.

Buying gold with credit card Gold purchase credit card Credit card benefits gold Credit card drawbacks gold Gold on EMI No-cost EMI gold Gold jewelry payment Digital gold credit card Credit card rewards gold Credit score impact gold purchase Interest rates on credit card gold Processing fees gold Credit utilization ratio gold Financial planning gold Jewelry shopping credit card EMI - EMI

భారతదేశంలో ఎక్కువ భాగం ప్రముఖ ఆభరణాల షాపులు, ఆన్‌లైన్ గోల్డ్ ప్లాట్‌ఫామ్లు కూడా క్రెడిట్ కార్డులను స్వీకరిస్తున్నాయి. మీరు బంగారు ఆభరణాలు, నాణేలు లేదా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలన్నా, చాలా చోట్ల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. అయితే, కొంతమంది డీలర్లు లేదా ప్లాట్‌ఫామ్లు ప్రాసెసింగ్ ఫీజులు లేదా రిస్క్ కారణంగా క్రెడిట్ కార్డులను స్వీకరించకపోవచ్చు.

క్రెడిట్ కార్డ్‌తో బంగారం కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనాలు:
1. బంగారం ధర అకస్మాత్తుగా తగ్గినప్పుడు, మీ దగ్గర తక్షణ నగదు లేకపోయినా, కార్డు ఉపయోగించి వెంటనే కొనుగోలు చేయొచ్చు. ఇది ఓ మంచి లాభంగా చెప్పొచ్చు.

2. ఒక్కసారిగా పెద్ద మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, EMI ఎంపికను ఎంచుకోవచ్చు. చాలా కార్డ్‌లు ఇప్పుడు నో-కాస్ట్ EMI కూడా అందిస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్‌లో కూడా విలువైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

3. పండుగలు, ప్రత్యేక ఆఫర్ల సమయంలో బంగారం కొనుగోలుపై రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ లాంటి ఆఫర్లు రావడం సాధారణం. ఇవి ఖర్చు చేసిన డబ్బుకు తిరిగి ప్రయోజనం లాంటివే.

4. క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు రక్షణ ఉంటుంది. మోసపూరిత లావాదేవీలను వెంటనే గుర్తించి రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ఏ రకం అయినా ట్రాకింగ్, వెరిఫికేషన్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయి.

5. సమయానికి బిల్లులు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో లోన్లు, ఇతర ఫైనాన్స్ సేవల కోసం ఉపయోగపడుతుంది.

అయితే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి:

1. మీరు పూర్తిగా బిల్ చెల్లించకపోతే, క్రెడిట్ కార్డ్ సంస్థలు సుమారు 35%-45% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీని వల్ల బంగారం అసలు ధర కంటే ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

2. కొన్ని జువెల్లరీ షాపులు లేదా కార్డు సంస్థలు పెద్ద మొత్తాలపై అదనపు ఛార్జీలు వేయొచ్చు. కొన్నిసార్లు ఇది 1%-2% వరకు ఉండవచ్చు. ముందుగానే ఇవి ఉంటాయా అని అడిగి తెలుసుకోవాలి.

3. ఒకసారి మీరు భారీగా కొనుగోలు చేస్తే, మీ కార్డ్‌లో ఉన్న లిమిట్ తగ్గిపోతుంది. దీని వల్ల మీ క్రెడిట్ ఉపయోగించే రేషియో పెరుగుతుంది, ఇది స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. బంగారం విలువ కాలక్రమంలో పెరుగుతూనే ఉంటుంది, కానీ క్రెడిట్ కార్డ్‌తో బంగారం కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఖర్చులు నిశ్శబ్దంగా పెరుగుతుంటాయి. సౌకర్యం, ఫ్లెక్సిబిలిటీ ఆకర్షణీయంగా కనిపించినా, అసలు ఖర్చు వివరాలు చాలాసార్లు ఫైన్ ప్రింట్‌లో దాగి ఉంటాయి-ఫీజులు, వడ్డీ, ఇతర ఛార్జీలు ఇలా. కాబట్టి మీరు స్వైప్ చేసే ముందు, మీరు నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నారో పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డ్‌తో బంగారం కొనడం మంచిదే కానీ, ముందు మీ ఫైనాన్స్‌ను అంచనా వేసుకుని, అన్ని ఛార్జీలు, బిల్లులు చూసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఈ లావాదేవీ లాభదాయకంగా మలచుకోగలుగుతారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+