ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జియోజిత్ ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ఏడాది కాలంలో ఈ స్టాక్ 19 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంచనా వేస్తోంది. ప్రస్తుతం హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్(HDFC) స్టాక్ ధర రూ.2771 వద్ద ఉంది. అంతకుముందు జియోజిత్ అంచనా వేసిన సమయంలో రూ.2809 వద్ద ఉంది. ఈ స్టాక్ ఏడాది కాలంలో రూ.3355కు చేరుకోవచ్చునని పేర్కొంది. అంటే ఏడాది కాలంలో దాదాపు 19 శాతం నుండి అంతకంటే ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వవచ్చునని పేర్కొంటున్నారు.
- కరెంట్ మార్కెట్ ధర (CMP) - రూ.2809,
- టార్గెట్ ధర రూ.3355,
- ఒక ఏడాదిలో రిటర్న్స్ 19.00%
HDFC నెట్ ఇంటర్నెట్ ఇన్‌కం(NII) ఏడాది ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి రూ.4110 కోట్లుగా నమోదయింది. ఎన్ఐఎం 3.6 శాతం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఇది 4 బేసిస్ పాయింట్లు. ప్యాట్ ఏడాది ప్రాతిపదికన 31.7 శాతంగా ఉంది. కాస్ట్ టు ఇన్‌కం రేషియో అంతకుముందు త్రైమాసికంలో 8.4 శాతం కాగా, గత త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదయింది. 2021 మొదటి అర్ధ సంవత్సరంలో కలెక్షన్స్, డిస్‌బర్స్‌మెంట్స్ సానుకూలంగా నమోదయ్యాయి. కంపెనీ లోన్ బుక్ రూ.507.645 కోట్లు (ఏడాది ప్రాతిపదికన 9.6 శాతం అధికం), AUM బేసిస్ లోన్ బుక్ 10.6 శాతం ఎగిసి 579,339 కోట్లకు చేరుకుంది. ఇండివిడ్యువల్ లోన్ బుక్ ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగింది.

ఈ బ్యాంకు దీర్ఘకాలంలో సానుకూల ఫలితాలను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని జియోజిత్ పేర్కొంది. సమీప భవిష్యత్తులో మార్జిన్స్ దాదాపు స్థిరంగా ఉండవచ్చునని, అయితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయని, అందుకే ఏడాది కాలానికి రూ.3355 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ దేశంలోని ఇండివిడ్యువల్స్‌కు, కార్పోరేట్లకు హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ కూడా చేస్తుంది. లీజ్ ఫైనాన్సింగ్ కూడా అందిస్తుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన వ్యవహారం. నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు మార్కెట్ పైన పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications