ప్రముఖ బ్రోకరేజీ సంస్థ KR చోక్సీ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. గత కొన్నాళ్ల పనితీరు, ఆయా స్టాక్స్ త్రైమాసిక ఫలితాలు, ఇతర కొలమానాల ఆధారంగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు వివిధ స్టాక్స్ కొనుగోలును సూచిస్తాయి. ఇందులో భాగంగా కేఆర్ చోక్సీ ఈ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు పైన బుల్లిష్‌గా ఉంది.
ప్రస్తుతం ఎస్బీఐ షేర్ ధర రూ.430 వద్ద ఉంది. క్రితం సెషన్‌లో ఎస్బీఐ స్టాక్ 0.84 శాతం లేదా రూ.3.60 లాభపడింది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో దాదాపు రెండింతలు ఎగిసిపడింది. ఇక 2021లో ఇప్పటి వరకు రూ.280 దిగువ నుండి రూ.430 పైకి చేరుకుంది. ఎస్బీఐ స్టాక్ ఇటీవల వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది.

ఎస్బీఐ టార్గెట్ ధర
ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం రూ.430.75 వద్ద ఉంది. అంటే దాదాపు రూ.431 వద్ద ఉందని భావించవచ్చు. అయితే ఈ స్టాక్ పైన కేఆర్ చోక్సీ బ్రోకరేజీ సంస్థ బుల్లిష్‌గా ఉండటంతో పాటు స్టాక్ టార్గెట్ ధరను రూ.531గా అంచనా వేస్తోంది. అంటే 23.43 శాతం లాభాలు రావొచ్చు. కేఆర్ చోక్సీ ప్రకారం FY22 మొదటి త్రైమాసికంలో సగటు వడ్డీ ఆదాయం 3.7 శాతం ఉంటుందని తెలిపింది. ఏడాది ప్రాతిపదికన నికర వడ్డీ మార్జిన్స్ తగ్గే అవకాశముందని పేర్కొంది. ప్రధానంగా యీల్డ్స్, డొమెస్టిక్ సీడీ రేషియో ఏడాది ప్రాతిపదికన 2 శాతం మేర తగ్గడంతో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది.
లోన్ బుక్ ఆరోగ్యకరమైనపెరుగుదలతో నికర వడ్డీ ఆదాయం మెరుగు పడుతుందని బ్యాంకు భావిస్తోంది. విదేశీ మారకద్రవ్య లాభాలు, రికవరీకి సంబంధించిన ఆదాయం పెరుగుదల నేపథ్యంలో ఇతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. FY22 మొదటి త్రైమాసికంలోప్రాఫిట్ రూ.6504 కోట్లుగా నమోదయింది. అధిక నిర్వహణ లాభాలు, తక్కువ కేటాయింపుల నేపథ్యంలో 55 శాతం వృద్ధి సాధంచింది.

ఎస్బీఐ షేర్ వృద్ధి
FY22 మొదటి త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేటింగ్ టర్మ్స్ నేపథ్యంలో స్థిరంగా ఉంది. లోన్ బుక్ గ్రోత్ స్థిరంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అసెట్ వ్యాల్యూ పైన ప్రభావం చూపింది. త్రైమాసికం పరంగా బ్యాంకు క్రమంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. బుక్ రీస్ట్రక్చరింగ్ కొనసాగుతోంది. బలమైన డిపాజిట్ ప్రాంచైజ్, లార్జ్ కస్టమైజ్ సైజ్, లోన్ బుక్ మిక్స్ బ్యాంకుకు ఉపయోగపడతాయి. ఇలా వివిధ కారణాల వల్ల PSU బ్యాంకుల్లో ఎస్బీఐ కరోనా వంటి తీవ్ర సంక్షోభాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొందని బ్రోకరేజీ సంస్థ పేర్కొంది.
FY21-23Eకి అసెట్స్ రిటర్న్ వృద్ధి 0.8 శాతంగా ఉండవచ్చునని, రిటర్న్ ఈక్విటీ వృద్ధి 14.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.450 కంటే భారీగా వృద్ధిని నమోదు చేస్తుందని, ఎస్బీఐ షేర్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నట్లు తెలిపింది.

రిస్క్ తీసుకునే ముందు...
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడు రిస్క్‌తో కూడినది. ట్రేడర్స్ కేవలం ఆర్టికల్ లేదా బ్రోకరేజీ సంస్థ ఆధారంగా పెట్టుబడి పైన నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని స్టాక్స్ కొనుగోలు చేయడం మంచిది. బ్రోకరేజీ సంస్థలు ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా టార్గెట్ ధరను నిర్ణయిస్తాయి. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఆయా స్టాక్స్ పైన, షేర్ మార్కెట్ పైన మంచి అవగాహన కలిగి ఉండాలి.


Click it and Unblock the Notifications