ఆరోగ్యంపై శ్రద్ధ..దీన్ని అవకాశంగా మలుచుకుని ఈ బిజినెస్ చేస్తే మీకు లక్షల్లో లాభాలు..పెట్టుబడి కూడా ఒక్కసారే..

నా పేరు రాకేష్..నేను ఉద్యోగం చేస్తున్నాను.. అయితే ఈ ఉద్యోగంలో నాకు అంతగా సంతృప్తి ఉండటం లేదు.. ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని ఉంది. నా కాళ్లమీద నేను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలని ఉంది. అయితే దీనికి సలహా కోసం ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు..వ్యాపారం గురించి అవగాహన ఎలా పెంచుకోవాలో తెలియడం లేదు..ఏం చేయాలో అర్థం కావడం లేదు..ఇది ఒక్క రాకేష్ కథ మాత్రమే కాదు.. అందరి కథ. చాలా మంది ఇదే విధంగానే ఆలోచిస్తుంటారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారం ఏదైనా ఉందా అని ఆలోచించే వాళ్లే ఎక్కువ..అయితే అలాంటి వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా..

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. రసాయనాలు లేకుండా తయారయ్యే ఆహార పదార్థాలకు పుల్లుగా డిమాండ్ ఉంది.దీన్ని క్యాష్ చేసుకోగలిగితే చాలా మీరు లక్షలో సంపాదించవచ్చు. దీని కోసం మీరు మినీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ వ్యాపారంలోకి దిగితే సరిపోతుంది. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, సన్‌ఫ్లవర్ వంటి పంటల నుండి నాణ్యమైన.. తాజాగా పిండిన నూనెను తయారు చేసి నేరుగా కస్టమర్లకు లేదా షాపులు, హోటల్స్, హెల్త్ స్టోర్స్‌కి విక్రియస్తే చాలు..మీరు తక్కువ కాలంలోనే సక్సెస్ పుల్ వ్యాపారవేత్తగా మారిపోతారు.

low investment business ideas high profit small business chemical free oil business organic oil making healthy cooking oil small scale oil mill cold pressed oil startup homemade edible oil profitable rural business sustainable food business

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి డబ్బు కూడా పెద్దగా అవసరం లేదు. ఒక చిన్న షాప్ లేదా గోడౌన్‌లో 15-20 కిలోల సామర్థ్యం గల కోల్డ్ ప్రెస్ మెషీన్, తూకం కొలిచే యంత్రం, స్టెయిన్లెస్ స్టీల్ బకెట్లు, ఫిల్టర్ క్లాత్ ఉంటే చాలు. దీంతో పాటుగా మొదటి దశలో కావాల్సిన రా మెటీరియల్ - ఇవన్నీ కలిపి సుమారు లక్షా యాభై వేల రూపాయల ఖర్చుతో సెట్ అవుతాయి. ప్యాకేజింగ్ బాటిల్స్, పౌచులు, లైసెన్స్, అద్దె వంటి ఖర్చులు కలిపినా కూడా ఖర్చు ఈ ఈ మొత్తానికి ఏమీ ఎక్కువ కాదు.

ఈ వ్యాపారానికి నెలవారీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు. రా మెటీరియల్, ప్యాకేజింగ్, విద్యుత్, అద్దె, మార్కెటింగ్ కలిపి సుమారు లక్ష రూపాయల లోపే ఉంటుంది. అయితే ఆదాయం మాత్రం ఈ వ్యాపారంలో మీరు లక్షలు సంపాదిస్తారు. ఒక రోజు 35 లీటర్ల పల్లీ నూనె ఉత్పత్తి చేసి, లీటరుకు సగటున రూ. 320కి అమ్మితే మీకు రోజుకు రూ.12 వేలకు పైగా టర్నోవర్ వస్తుంది. అలా నెలకు 26 రోజులు పని చేస్తే సుమారు రూ. మూడు లక్షలకు పైగా టర్నోవర్ వస్తుంది. దానిలో కనీసం 90 వేల నుండి రూ.లక్ష వరకు నికర లాభం కనిపిస్తుంది.మీ వ్యాపారం మరింతగా పెరిగితే రూ.2 లక్షల వరకు ఆదాయం రావొచ్చు. కేవలం రెండు మూడు నెలల్లోనే పెట్టుబడి రికవరీ అవుతుంది.

మార్కెటింగ్ విషయానికి వస్తే.. మీ పరిసరాల కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలను టార్గెట్ చేయాలి. కెమికల్ ఫ్రీ - తాజాగా పిండిన నూనె అంటూ సోషల్ మీడియాని వ్యాపారానికి ఉపయోగించుకోవాలి. తాజాగా పిండిన నూనె - వెంటనే మీ ఇంటికి అంటూ కోటేషన్లతో కస్టమర్లను ఆకట్టుకోవాలి. అదేవిధంగా హెల్త్ ఫుడ్ స్టోర్స్, హోటల్స్, బేకరీలతో కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ద్వారా కూడా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

మీరు ఒకే రకం ఆయిల్‌తో మొదలుపెట్టి.. క్రమంగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి రకరకాల విభాగాలకు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. భవిష్యత్తులో మీ బ్రాండ్‌ను సూపర్‌మార్కెట్లలో కూడా లిస్టింగ్ చేయించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మినీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ మీకు అత్యంత తక్కువ కాలంలోనే విజయాన్ని అందించే అవకాశం ఉంటుంది.

వ్యాపారానికి అయ్యే ఖర్చు వివరాలు (అంచనా) ఇది పెట్టుబడి..
వస్తువు అంచనా ఖర్చు రూపాయిల్లో
కోల్డ్ ప్రెస్ మెషీన్: (20-25 kg/hr) 1,10,000
వెయిటింగ్ స్కేలు: 4,000
స్టెయిన్లెస్ స్టీల్ బకెట్లు & ఫిల్టర్ క్లాత్ : 6,000
రా మెటీరియల్ (పల్లీలు మొదలైనవి) మొదటి స్టాక్ : 16,000
ప్యాకేజింగ్ మెటీరియల్ (బాటిల్స్/పౌచులు) : 5,000
అద్దె (1 నెల) : 4,000
లైసెన్స్ & FSSAI రిజిస్ట్రేషన్ : 3,000
మొత్తం ఖర్చు: 1,48,000

నెలవారీ ఖర్చు వివరాలు చూసుకుంటే (అంచనా)
ఐటమ్ నెలవారీ ఖర్చు రూపాయిల్లో
రా మెటీరియల్ : 80,000
విద్యుత్ & నీటి బిల్లు : 2,500
అద్దె: 5,000
ప్యాకేజింగ్ : 10,000
మార్కెటింగ్ : 3,000
మొత్తం ఖర్చు: 1,00,500

ఆదాయం వివరాలు అంచనా రూపాయిల్లో

రోజు ప్రొడక్షన్: 40 లీటర్లు (పల్లీ నూనె ఉదాహరణ)

లీటర్ ధర: రూ. 330 (సగటు)

రోజు టర్నోవర్: 40 × రూ. 330 = రూ. 13,200

నెలవారీ టర్నోవర్ (26 రోజులు): 3,43,200

నికర లాభం: రూ. 3,43,200 - రూ. 1,00,500 = రూ. 2,42,700 (ఇది అంచనా.. అయితే మొదటి 3 నెలల్లో రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు లాభం ఉంటుంది.. తర్వాత క్రమంగా పెంచుకుంటూ పోతే రెట్టింపవుతుంది) సుమారు 2-3 నెలల్లోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మీ చేతికి వస్తుంది.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+