3 రోజుల్లో మూడు రెట్ల లాభాలు, బర్గర్ కింగ్ అదిరిపోయే రిటర్న్స్
బర్గర్ కింగ్ దుమ్మురేపుతోంది. నిపుణులను, ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తూ మూడు రోజుల్లోనే ఈ అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుట్ చైన్ దిగ్గజం మూడు రెట్ల రిటర్న్స్ ఇచ్చింది. రూ.60 వద్ద పబ్లిక్ ఇష్యూకు వచ్చిన బర్గర్ కింగ్ సోమవారం 131 శాతం లాభపడి రూ.138.40 వద్ద ముగిసింది. నిన్నటి సెషన్లో రూ.166 వద్ద ముగిసింది. నేడు ఏకంగా రూ.200 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం బర్గర్ కింగ్ షేర్ 20 శాతం ఎగిసి రూ.199.25 వద్ద క్లోజ్ అయింది. ఈ షేర్ ధరను విక్రయించడానికి ఎవరులేరు. కొనుగోలుకు మాత్రం 14 లక్షల మంది వరకు ఉన్నారు.

3 రెట్ల లాభాలు
బర్గర్ కింగ్ షేర్ రెండు రోజులుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్స్‌ను తాకుతోంది. తాజాగా బీఎస్ఈలో ఈ షేర్ రూ.33 ఎగసి రూ.199 వద్ద ఫ్రీజ్ అయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడ్డారు ఇన్వెస్టర్లు. ఇందుకు ఈ కౌంటర్‌లో కొనేవాళ్లు అధికంగా ఉండటమే కాకుండా, అమ్మకానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బర్గర్ కింగ్ మానియా కొన్ని రోజులు ఇలాగే కొనసాగవచ్చునని భావిస్తున్నారు.

ఇవన్నీ లాభాలు తెచ్చాయి
రూ.1,000 కోట్ల లోపు పబ్లిక్ ఇష్యూకు వచ్చిన పెద్ద కంపెనీలు మూడేళ్లుగా మొదటి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నాయని టార్గెట్ ఇన్వెస్టింగ్‌కు చెందిన సమీర్ కల్రా అన్నారు. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్స్ కంపెనీ వ్యాల్యుయేషన్ గుర్తుకురావన్నారు. డోమినోస్ పిజ్జా షేర్లు కూడా ఇలాగే లాభాలు ఆర్జించినట్లు తెలిపారు.

700 రెస్టారెంట్లు టార్గెట్
బర్గర్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ బర్గర్ బ్రాండ్. ఫాసెస్ట్ గ్రోయింగ్ క్యూఎస్ఆర్ చైన్. 2026 నాటికి 700 రెస్టారెంట్లు టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. 2014 నవంబర్ నెలలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్ కింగ్ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లు నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications