కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపింది. బడ్జెట్ ప్రసంగానికి ముందు అంతర్జాతీయ పరిణామాలు, ఎకనమిస్ సర్వే ప్రభావంతో సూచీలు ఎగిసిపడ్డాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సమయంలో సూచీలు దాదాపు స్థిరంగా కొనసాగాయి. ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే బడ్జెట్ ప్రసంగం పూర్తైన తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే అంతలోనే తిరిగి కోలుకొని, తిరిగి ఉదయం ప్రారంభమైన స్థానానికి వెళ్లాయి.

ప్రసంగం తర్వాత కుప్పుకూలి.. మళ్లీ పైకి
సెన్సెక్స్ ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. బడ్జెట్ ప్రసంగానికి ముందు, బడ్జెట్ ప్రసంగం సమయంలో దాదాపు అలాగే ఉంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ గంటన్నరపాటు సాగింది. అప్పటి వరకు మార్కెట్ దాదాపు స్థిరంగా ఉంది. అయితే మధ్యాహ్నం గం.1 నుండి సూచీల పతనం ప్రారంభమైంది. భారీ లాభాల నుండి ఏకంగా నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న 58,014 వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు బడ్జెట్ ప్రసంగం వరకు ఏ దశలోను కిందకు రాలేదు. పైగా, 600 పాయింట్ల నుండి 700 పాయింట్ల పైనే ఉంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం హఠాత్తుగా కిందకు పడిపోయింది. దాదాపు 300 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మార్కెట్ నష్టాలు కొద్ది నిమిషాలే. ఆ తర్వాత కోలుకున్నాయి. ఎలాగైతే హఠాత్తుగా పడిపోయాయో, అలాగే మళ్లీ పైకెగిశాయి. మధ్యాహ్నం గం.2.15 సమయానికి సెన్సెక్స్ 736 పాయింట్లు లాభపడి 58,750 పాయింట్ల వద్ద, నిఫ్టీ 204 పాయింట్లు ఎగిసి 17,544 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, ఎస్సీఐ, సన్ ఫార్మా, జిందాల్ స్టీల్, నవీన్ ఫ్లోర్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో హింద్ పెట్రో, బీపీసీఎల్, ఫోనెక్స్ లిమిటెడ్, ఎలెకాన్, ఎంఎంటీసీ ఉన్నాయి.

నిర్మలమ్మ స్కీమ్.. ఈ స్టాక్స్ జంప్
నిర్మలమ్మ బడ్జెట్ ప్రకటనను అనుసరించి పలు రంగాల స్టాక్స్ నేడు దుమ్మురేపాయి. బడ్జెట్‌లో జల్ సే నల్ యోజ్నాను ప్రకటించారు. ఇందుకు రూ.60,000 కోట్లను కేటాయించారు. దీంతో ప్లాస్టిక్ పైప్ స్టాక్స్ హఠాత్తుగా ఎగిశాయి. ప్రసంగం తర్వాత నుండి ఈ స్టాక్ అంతకంతకూ ఎగిసింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సుప్రీం ఇండస్ట్రీస్ 4 శాతం, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 4.7 శాతం, అస్ట్రా లిమిటెడ్ 1.18 శాతం లాభపడ్డాయి.
వచ్చే మూడేళ్లలో 400 న్యూ-జన్ వందేభారత్ రైళ్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. దీంతో స్టీల్ స్టాక్స్ పుంజుకున్నాయి. టాటా స్టీల్స్ షేర్ ధర 7 శాతం కంటే పైగా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాక్ 5 శాతానికి పైగా లాభపడింది. ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వే, రైల్ వికాస్ నిగమ్, కాన్‌కర్, టిటాగర్ వాగోన్ స్టాక్స్ పెరిగాయి.
ఎంఎస్ఎంఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ 3.2 శాతం, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ 3.22 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.7 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ 2.55 శాతం, ఆవాస్ ఫైనాన్స్ 6.68 శాతం లాభపడ్డాయి.

ఈ స్టాక్స్ కూడా
బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా 5జీ, ఇన్ఫ్రా స్టాక్స్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది.
5జీ హైవే నెట్ వర్క్ ఎక్స్‌పాన్షన్ ప్రకటన తో పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్, ఐఆర్బీ ఈన్ఫ్రా, దిలిప్ బిల్డ్‌కాన్, అశోకా బిల్డ్ కాన్ షేర్లు లాభపడ్డాయి.
అమర రాజా, ఎక్సైడ్ వంటి బ్యాటరీ పరిశ్రమ స్టాక్స్ కూడా లాభపడ్డాయి.
5జీ ప్రకటన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ స్టాక్స్ పరుగు పెట్టాయి.
కెమికల్ ఫ్రీ నేచరల్ ఫామింగ్ నేపథ్యంలో పెర్టిలైజర్ స్టాక్స్ (చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ ఫెర్టిలైజర్స్) పైన ప్రభావం చూపింది.య
ఈ-పాస్ పోర్ట్ ప్రకటనతో ఐటీ స్టాక్స్ జంప్ చేశాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications