For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రోజుల క్రితం రూ.1.29 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మీ చేతికి రూ.2.26 లక్షలు

|

2021 క్యాలెండర్ ఏడాదిలో చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్‌గా నిలిచాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇక్కట్లు నెలకొన్న పరిస్థితుల్లో వివిధ స్టాక్స్ లేదా వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం మంచి రిటర్న్స్ వచ్చాయి. అదే సమయంలో 2022 ఏడాదిలోను పలు పెన్నీ స్టాక్స్ మంచి రిటర్న్స్ అందించాయి. అందులో ఒకటి క్లారా ఇండస్ట్రీస్. ఈ బీఎస్ఈ ఎస్ఎంఈ లిస్టెడ్ స్టాక్ గత తొమ్మిది సెషన్‌లలోనే రూ.42.80 నుండి రూ.75.40కి పెరిగింది. ఈ స్టాక్ ఈ కొద్ది సెషన్‌లలోనే 76 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

తొమ్మిది సెషన్లలో 76% లాభం

తొమ్మిది సెషన్లలో 76% లాభం

క్లారా ఇండస్ట్రీస్ స్టాక్ డిసెంబర్ 30, 2021న రూ.42.80 వద్ద ఉంది. ఈ ఎస్ఎంఈ స్టాక్ నేడు ఉదయం రూ.5.65 లాభపడింది. అయితే ఆ తర్వాత మరింత పెరిగి నేడు మార్కెట్ ముగిసేసరికి రూ.12.55 లేదా 19.97 శాతం లాభపడి రూ.75.40 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌‍లో రూ.62.85 వద్ద ముగిసింది. నేడు ఒక్కరోజే ఈ స్టాక్ ఇరవై శాతం లాభపడింది. మొత్తంగా డిసెంబర్ 30 నుండి జనవరి 12 వరకు తొమ్మిది సెషన్‌లలో రూ.42.80 నుండి రూ.75.40కి చేరుకుంది.

లిస్టింగ్..

లిస్టింగ్..

కార్లా ఇండస్ట్రీస్ స్టాక్ డిసెంబర్ 29, 2031న లిస్ట్ అయింది. బీఎస్ఈ ఎస్ఎంఈ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది. ఒక ఐపీవో లాట్‌లో 3000 షేర్లు ఉన్నాయి. అంటే పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇన్వెస్టర్ కనీసం రూ.1.29 లక్షలు (రూ.43 x 3000) పెట్టుబడి పెట్టాలి. ఈ స్టాక్ 29వ తేదీన రూ.43.20 వద్ద లిస్ట్ అయింది. రూ.44 వద్ద క్లోజ్ అయింది. ఆ రోజు రూ.45.30 వద్ద గరిష్టాన్ని తాకింది. 30 డిసెంబర్ రోజున రూ.42.80 వద్ద ముగిసింది.

రూ.1.29 లక్షల నుండి రూ.2.26 లక్షలకు..

రూ.1.29 లక్షల నుండి రూ.2.26 లక్షలకు..

ఇన్వెస్టర్ ఎవరైనా ఒకరు కార్లా ఇండస్ట్రీస్‌లో రూ.1.29 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ మొత్తం రూ.2.26 లక్షల కంటే పైగా అవుతుంది. అంటే దాదాపు రెండింతలు రిటర్న్స్ ఇచ్చినట్లు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఐపీవోలో పాల్గొని, ఈ స్టాక్స్ మీ వద్ద కొనసాగిస్తే అదిరిపోయే రిటర్న్స్ వచ్చేవి.

English summary

10 రోజుల క్రితం రూ.1.29 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మీ చేతికి రూ.2.26 లక్షలు | BSE SME stock gives 76 percent return in last 9 trade sessions

Year 2021 was a remarkable one for Indian stock markets as it managed to scale record high despite global economy reeling under the Covid-19 pandemic heat.
Story first published: Wednesday, January 12, 2022, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X