ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకెట్ యాప్ ద్వారా బంపర్ క్యాష్ బ్యాక్ పొందవచ్చును. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్యోల్భణం భారీగా పెరుగుతుంది. ఇది మధ్య తరగతి, సామాన్య కుటుంబాలపై పెను ప్రభావం చూపుతోంది. ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో సిలిండర్ గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ ధర రూ.1000 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కొంతైనా ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.

పాకెట్స్ యాప్ బంపర్ క్యాష్ బ్యాక్
పాకెట్స్ యాప్ మీకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. ఈ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే మీరు క్యాష్ బ్యాక్ పొందుతారు. ప్యాకెట్స్ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే పది శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ యాప్‌ను ఐసీఐసీఐ బ్యాంకు తీసుకువచ్చింది.
ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు రూ.200 లేదా అంతకంటే ఎక్కువ పాకెట్స్ యాప్ ద్వారా బిల్ పేమెంట్ చేస్తే పది శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కస్టమర్లకు ఎలాంటి ప్రోమోకోడ్ అవసరం లేదు.

ఇది గుర్తుంచుకోండి
ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఒక నెలలో మూడు బిల్లు పేమెంట్స్ పైన మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తించాలి. కంపెనీ మార్గదర్శకాల ప్రకారం ఒక గంటలో కేవలం 50 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలరు. కస్టమర్లు ఒక గంటలో గరిష్టంగా 1 రివార్డ్ లేదా క్యాష్ బ్యాక్ మరియు బిల్లు చెల్లింపుపై ఒక నెలలో మూడు రివార్డ్స్ లేదా క్యాష్ బ్యాక్స్ పొందవచ్చును.

గ్యాస్ బికింగ్ పైన ఎలా?
- మీ ప్యాకెట్స్ వ్యాలెట్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
- రీచార్జ్, బిల్స్ పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
- పే బిల్స్ పైన ట్యాప్ చేయండి.
- బిల్లర్స్ సెక్షన్‌లో మరిన్ని పైన ట్యాప్ చేయండి.
- ఎల్పీజీ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- మీ ఎల్పీజీ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- మీ బుకింగ్ అమౌంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
- బుక్ అండ్ పే పైన క్లిక్ చేయాలి.
- ట్రాన్సాక్షన్ అనంతరం, మీకు పది శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మీ ప్యాకెట్స్ వ్యాలెట్‌లోకి వస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications