బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టో వ్యాల్యూ ఎంతంటే?
క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ మరింత పతనమైంది. బిట్ కాయిన్‌తో పాటు ఇతర కరెన్సీలు కూడా పతనం బాటలోనే ఉన్నాయి. బిట్ కాయిన్ ఓ సమయంలో 64వేల డాలర్లను, ఎథేరియం 3వేల డాలర్లను క్రాస్ చేశాయి. కానీ ఇప్పుడు దాదాపు సగం వరకు పడిపోయాయి. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ గత 24 గంటల్లో ఓ సమయంలో 31,179 డాలర్లకు కూడా పడిపోయింది. బిట్ కాయిన్ గత నెల 14వ తేదీన 64,829 డాలర్లు పలికింది. అయితే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ నేపథ్యంలో పతనమవుతూ వస్తోంది. దీనికి చైనా నిర్ణయం కూడా తోడయింది.

క్రిప్టో వ్యాల్యూ
నేడు వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉన్నాయి.
బిట్ కాయిన్: $35,602
ఏథేరియం: $2,184.76
టెథెర్: $1
బియాన్స్: $274.62
కార్డానో: $1.38
డోజీకాయిన్: $0.3065
XRP: $0.8023
పోల్కాడాట్: $18.53
ఇంటర్నెట్ కంప్యూటర్: $144.10

సింగిల్ డే పతనం
గత నెల రోజుల్లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ వ్యాల్యూ 830 డాలర్లు పడిపోయింది. దీంతో మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ వ్యాల్యూ సోమవారం ఉదయం నాటికి 1.49 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ గత వారం 60 శాతం క్షీణించింది. ఇందులో టాప్ రెండు డిజిటల్ టోకెన్స్ బిట్ కాయిన్, ఎథేరియం ఎక్కువగా పడిపోయాయి. బిట్ కాయిన్ వ్యాల్యూ ఓ సమయంలో 30వేల డాలర్లకు పడిపోయింది. జనవరి నుండి ఇదే కనిష్టం.

దాదాపు సగం..
ఇతర కరెన్సీలు కూడా దాదాపు సగం వరకు పడిపోయాయి. బిట్ కాయిన్, ఏథేరియం సింగిల్ డే అత్యంత పతనం మార్చి 2020 తర్వాత నిన్న కనిపించింది. కొద్ది రోజుల్లోనే డిజిటల్ కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్ల నుండి 1 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.


Click it and Unblock the Notifications