క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ రోజురోజుకు పెరుగుతోంది. రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. రెండు రోజుల క్రితం ట్రేడింగ్‌లో ఈ డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ చరిత్రలో తొలిసారి 52,000 డాలర్ల పైకి చేరింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ 50,000 డాలర్లకు పైనే ఉంది. భారత కరెన్సీ రూపాయిలో ఇది రూ.37 లక్షలకు పైన. గత రెండు నెలలుగా బిట్ కాయిన్ 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్లు దాటింది. ఈ క్రిప్టో కరెన్సీ గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బుల వర్షం కురిపిస్తోంది.
అయితే ఇది ఎంత కాలం కొనసాగుతుంది, గరిష్టాన్ని తాకిన ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే ఆందోళన చాలామందిలో ఉంది. ఓ వైపు టెస్లా వంటి దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టడం, మాస్టర్ కార్డ్ వంటివి ఎంపిక చేసిన క్రిప్టోకరెన్సీలను అంగీకరిస్తామని చెప్పడం వంటివి బిట్ కాయిన్‌కు ఊతమిస్తుండగా, మరోవైపు ఇది గాలి బుడగగా మారుతుందా అనే ఆందోళన కూడా చాలామందిలో ఉంది.

బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా జంప్
ఇటీవల బిట్ కాయిన్ పెరుగుదలకు ఇన్వెస్టర్లు కారణం. టెస్లా, మాస్టర్ కార్డ్, పేపాల్, మైక్రోస్ట్రాటజీ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు క్రిప్టోకు అనుకూలంగా పాలసీని మార్చడంతో బిట్ కాయిన్ 50వేల డాలర్లు దాటింది. బిట్ కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకు వచ్చారు.
ప్రభుత్వ కరెన్సీల మాదిరిగా దీనికి నియంతృత్వ వ్యవస్థలేదు. ఇన్వెస్టర్ల ఖాతాల్లో మాత్రమే కనిపించే దీని వ్యాల్యూ ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ.37 లక్షలకు పైగా ఉంది. కరోనాకు ముందు 10000 డాలర్ల లోపు ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 50వేల డాలర్లు దాటింది.

నాలుగేళ్ల క్రితం ఇలాగే...
బిట్ కాయిన్ వ్యాల్యూ పెరుగుతున్నప్పటికీ, కొంతమందిలో నాలుగేళ్ల క్రితం అనుభవం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా సాఫ్టువేర్ కంపెనీ మైక్రోస్ట్రాటెజీ బుధవారం మరిన్ని బిట్ కాయిన్స్ కొనుగోలు కోసం కన్వర్టబుల్ బాండ్స్‌ను విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే 2017లో క్రిప్టోవైపు మొగ్గు చూపిన సమయంలో ఆ తర్వాత హఠాత్తుగా పడిపోయిన విషయానని గుర్తు చేస్తున్నారు.

అప్పుడు అలా పతనం
2017లో బిట్ కాయిన్ భారీగా లాభపడింది. ఆ సంవత్సరం జనవరిలో 1000 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ డిసెంబర్ నాటికి దాదాపు 20,000 డాలర్లు దాటింది. ఆ సంవత్సరంలోనే ఆ స్థాయిలో పెరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అక్టోబర్ 2017 నాటికి భారీగా పతనమైన బిట్ కాయిన్ 5000 డాలర్లకు క్షీణించింది.
బిట్ కాయిన్ పెరుగుదల ఎలా ఉంటుందో చెప్పలేమని, ఇది వెరి రీస్కీ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో త్వరలోనే ఒక లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని మరికొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ వ్యాల్యూ గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఉంది. మొత్తం బిట్ కాయిన్ గ్లోబల్ సర్క్యులేషన్ 1 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications