బిట్ కాయిన్ కీలక మద్దతు ధరలు ఏవంటే: ఆ స్థాయిని దాటేసిన క్రిప్టో..
క్రిప్టోకరెన్సీ మళ్లీ పతనావస్థకు చేరుకుంది. వీకెండ్స్ శనివారం, ఆదివారం 5 శాతం నుండి 15 శాతం వరకు క్షీణించాయి వివిధ క్రిప్టోకరెన్సీలు. అన్ని దిగ్గజ క్రిప్టోకరెన్సీలు... డోజీకాయిన్, ఎథేరియం, కార్డానో, షిబా, పోల్కాడాట్ వంటివి గత రెండు రోజులుగా క్షీణిస్తున్నాయి. క్రిప్టోపై చైనా నిర్ణయం అనంతరం పైపైకి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏ దశలోను పైకి చేరుకోవడం లేదు. రోజురోజుకు పడిపోతున్నాయి. చైనా నిర్ణయం నేపథ్యంలో బ్యాంకులు, ఆన్ లైన్ పేమెంట్ ఛానల్స్ క్రిప్టో బిజినెస్‌కు దూరంగా ఉన్నాయి.

పడుతూ లేస్తూ...
క్రిప్టో బిట్ కాయిన్ గత నెలలో 65వేల డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అయితే ఆ తర్వాత పలుమార్లు 40వేల డాలర్ల దిగువకు వచ్చింది. ఈ వీకెండ్‌లోను 35వేల డాలర్ల దిగువన కూడా ట్రేడ్ అయింది. అంతలోనే మళ్లీ కాస్త పైకి చేరుకుంది. ఇప్పటికి పలుమార్లు 35వేల డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, మళ్లీ పైకి లేచింది. ఇది కీలక పాయింట్. ప్రస్తుతం 36వేల డాలర్లు దాటి 37వేల డాలర్ల దిశగా వెళ్తోంది. శనివారం ఓ సమయంలో 34వేల దిగువకు పడిపోయాలా కనిపించింది.

ఎథేరియం 3 శాతం డౌన్
రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం గత వీకెండ్‌లో 3 శాతం, డోజీకాయిన్ 1 శాతం పడిపోయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ కీలక సపోర్ట్ లెవల్ 35వేలకు పైన ఉంది. బిట్ కాయిన్ కీలక మద్దతు స్థాయికి పైన ఉండటం పెట్టుబడిదారులకు కాస్త సానుకూలం. ప్రస్తుతం బిట్ కాయిన్ 35వేల నుండి 37వేల మధ్య కదలాడుతోంది.

కీలక మద్దతు ధర
బిట్ కాయిన్ 35,000 కీలక మద్దతుకు పైన ఉంది. ఆ తర్వాత కీలక మద్దతు 37,000 డాలర్లు, ఆ తర్వాత 40వేల డాలర్లుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 40వేల డాలర్ల వద్ద కీలక పరీక్షను ఎదుర్కోవచ్చునని, ఆ తర్వాత మద్దతు ధర 42వేల డాలర్లుగా పేర్కొంటున్నారు. 44వేల డాలర్ల మరో మద్దతు స్థాయి తర్వాత బిట్ కాయిన్ అంతకంతకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications