2021 సంవత్సరంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీ ఊగిసలాటలో ఉంది. ఓ వైపు ఎల్‌సాల్వేడార్ బిట్ కాయిన్‌ను లీగల్ టెండర్‌గా స్వీకరించింది. అదే సమయంలో యూఎస్-ఎస్ఈసీ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ కాయిన్‌బేస్ గ్లోబల్ పైన దావా వేయాలని యోచిస్తోంది. బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలు 2021లో ఇప్పటి వరకు అస్థిరంగా కదలాడుతున్నాయి. జనవరిలో బిట్ కాయిన్ 28,000 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత ఆల్ టైమ్ గరిష్టం 64,000 డాలర్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత ఓ సమయంలో 29,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 45,000 డాలర్ల స్థాయిలో ఉంది. బిట్ కాయిన్ ఇటీవలి కాలంలో 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటుకు గురయింది. ప్రస్తుతం 45,000 డాలర్ల దిగువన ఉన్న బిట్ కాయిన్, సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయవచ్చునా అనే ప్రశ్న ఉదయిస్తుంది. లాంగ్ టర్మ్‌లో బిట్ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేయవచ్చు.

పతనమైనప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. నేడు సెన్సెక్స్ ఏకంగా 60,000 పాయింట్ల పైన ముగిసింది. అయితే సూచీలు ఎప్పుడైనా కరెక్షన్‌కు గురి కావొచ్చుననే వాదనలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు 2008లో స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు చూస్తే కొంతమంది పెట్టుబడిదారులు ఆందోళనతో తమ పెట్టుబడులు కొంత నష్టంతో వెనక్కి తీసుకున్నారు. కొంతమంది 15,000 వద్ద, మరికొంతమంది 12000 వద్ద, ఇంకొంతమంది 9000 పాయింట్ల వద్ద వెనక్కి తీసుకున్నారు. 2008లో సెన్సెక్స్ 20,000 పాయింట్ల నుండి 9000 దిగువకు పడిపోయింది. డిజిటల్ కరెన్సీ ఇటీవలే వచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్ వంటిదే. కాబట్టి మార్కెట్లో భారీగా పతనమైనప్పుడు కొనుగోలు చేయవచ్చును. కానీ అన్ని పరిశీలించి, ఆచితూచి వ్యవహరించాలి. ఏ స్టాక్ లేదా ఆ క్రిప్టోను, ఏ స్థాయిలో కొనుగోలు చేయాలనే అంశాలను పూర్తిగా పరిశీలించి, ఆ తర్వాత ముందడుగు వేయాలి. క్రిప్టో కరెన్సీని పతనం సమయంలో కొనుగోలు చేయవచ్చు. సమీప భవిష్యత్తులో ఎలా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి పెట్టుబడి అవుతుంది.

క్రిప్టోలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి
పెట్టుబడికి సంబంధించి ప్లాన్ ఉండాలి. స్టాక్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, బంగారంపై ఎంత చేయాలి, క్రిప్టోలో ఎంత పెట్టుబడి పెట్టాలనేది కీలకం. క్రిప్టో పెట్టుబడికి మీ పోర్ట్‌పోలియోలో ఐదు శాతాన్ని కేటాయించాలి. మీ క్రిప్టో పోర్ట్ పోలియో 5 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ మేరకు డిప్‌లో కొనుగోలు చేయాలి. అయితే ఐదు శాతం అనేది స్టాండర్డ్ రూల్ ఏమీ కాదు. కానీ ఏ పోర్టో పోలియోలో ఎంత మేర కేటాయించాలనే అంశం కీలకం.

ఎంచుకోండి..
స్టాక్ మార్కెట్లో బిగ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, పెన్నీ స్టాక్స్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లోను అలా ఎంచుకోవచ్చు. వందలు, వేలాది క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం, కార్డానో, ఎక్స్‌పీఆర్, బియాన్స్ కాయిన్ ఇలా ఒక డాలర్ దిగువ నుండి 45వేల డాలర్ల వరకు ఉన్నాయి. మీ రిస్క్ ప్రొఫైల్, ఆ పెట్టుబడి ఆదాయం ఆధారంగా ఎంచుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications