ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇటీవల తన కస్టమర్ల కోసం పలు ఆఫర్లను తీసుకు వచ్చింది. హోమ్ లోన్, కారు లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్ అయినా లేదా డిపాజిట్స్ పైన ఎక్కువ రాబడి లేదా ఎక్కువ వడ్డీని పొందాలనుకుంటే ఎస్బీఐ నుండి మంచి డీల్స్ ఉన్నాయి. ఎస్బీఐ తీసుకు వచ్చిన ఈ డీల్స్ మిస్ చేసుకోవాలనిపించదు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్బీఐ తక్కువ వడ్డీ రేట్లు, రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు, పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేట్లు వంటి వాటిని ప్రకటించింది. రుణాల నుండి కొత్త డిపాజిట్ స్కీం వరకు ఎస్బీఐ అందిస్తోన్న ఈ డీల్స్ పైన ఓ కన్నేయండి...

SBI హోమ్ లోన్ ఆఫర్స్
హోమ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ కలల ఇంటిని ఎస్బీఐ హోమ్ లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చునని, యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు పైన 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని, అలాగే హోమ్ లోన్ పైన జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని పేర్కొంది.
అలాగే, మహిళలు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు పైన 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ప్రస్తుతం ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతం వద్ద ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 7208933140 మిస్ కాల్ ఇవ్వవచ్చు.

SBI కారు లోన్ ఆఫర్
ఎస్బీఐ కారు లోన్‌తో పాటు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఎస్బీఐ ఆఫర్ల వర్షంలో తడిసిపోండి, కారు రుణం, బంగారు రుణం, గోల్డ్ రుణం, పర్సనల్ లోన్ పైన వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నామని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు ఎస్బీఐ నుండి 25 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రేటు డిస్కౌంట్‌ను పొందుతారు. ఎస్బీఐ కస్టమర్లు ప్రతి ఏడాది 7.5 శాతం వడ్డీ రేటుతో కారు రుణాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఎస్బీఐ కారు రుణం కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లు 90 శాతం వరకు ఆన్-రోడ్ ఫైనాన్స్ పొందవచ్చు.

SBI గోల్డ్ లోన్ ఆఫర్
ఎస్బీఐ గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు బ్యాంకు 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7.5 శాతం వద్ద ఉంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు జీరో ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఎస్బీఐ రూ.20,000 నుండి రూ.50 లక్షల వరకు బంగారం రుణాలు అందిస్తోంది. బంగారం రుణాలపై 25 శాతం మార్జిన్, బుల్లెట్ రీపేమెంట్ పైన 35 శాతం, లిక్విడ్ బంగారంపై 25 శాతం మార్జిన్‌తో అందిస్తోంది.

ట్యాక్స్ పేయర్స్‌కు ఎస్బీఐ ఆఫర్
ట్యాక్స్ పేయర్స్‌కు కూడా ఎస్బీఐ శుభవార్త తెలిపింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. భారత 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నామని, యోనో యాప్ ద్వారా ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చునని పేర్కొంది. రూ.199తో ట్యాక్స్ పేయర్స్ అసిస్టెన్స్ కూడా కోరవచ్చు. యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే మొదట యోనో ఎస్బీఐలోకి లాగ్-ఇన్ కావాలి. ఆ తర్వాత shop and order లోకి వెళ్లాలి. ఆ తర్వాత Tax & Investment లోకి వెళ్లి, Tax2win ద్వారా ఫైల్ చేయాలి.

టర్మ్ డిపాజిట్స్ పైన...
ఎస్బీఐ కస్టమర్స్ ఇప్పుడు టర్మ్ డిపాజిట్స్ పైన అదనంగా 0.15 శాతం వడ్డీని పొందవచ్చు. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్స్ పైన ఇది వర్తిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ 14 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లాటినమ్ డిపాజిట్ స్కీంను ప్రారంభించింది.

ఎస్బీఐ రాఖీ ఆఫర్
రక్షా బంధన్ సందర్భంగా తాము ఇష్టపడేవారికి బహుమతులు కొనుగోలు చేసేందుకు మరింత సులభతరం చేయడానికి SBI నుంచి రక్షా బంధన్ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ వినియోగించుకుని కస్టమర్లు ఇతర ప్రజలు రక్షా బంధన్‌ను జరుపుకోవాలని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఫెర్న్ ఎన్ పెటల్స్ వద్ద షాపింగ్ చేయండి మరియు YONO SBI ద్వారా రూ .999 వరకు లేదా 20% తగ్గింపు పొందండి అని పేర్కొంది.
రాఖీ పండుగ సందర్భంగా షాపింగ్ చేయడం ద్వారా రూ.999 వరకు లేదా ఫ్లాట్ 20% డిస్కౌంట్ పొందుతారు. SBI వినియోగదారులు ఈ ఆఫర్‌ని ఆగస్ట్ 22, 2021 వరకు పొందవచ్చు. ఈ ఆఫర్‌లో కనీస ఆర్డర్ పరిమితి లేదు. అంటే కస్టమర్ ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నాడో అంత మేరా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయొచ్చు. డిస్కౌంట్స్ పొందొచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications