మీరు కొత్తగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు.. దాని పక్కన ఉన్న పాత వస్తువులన్నీ చాలా డొక్కుగా కనిపిస్తున్నాయా? వెంటనే వాటిని కూడా మార్చేయాలనిపిస్తోందా? అయితే మీకు తెలియకుండా మీరొక సైకలాజికల్ ట్రాప్‌లో చిక్కుకున్నట్టే! దీన్నే డైడెరో ఎఫెక్ట్ (Diderot Effect) అంటారు. ఇలాంటి ట్రాప్ లో చిక్కుకున్నవాళ్లు మన చుట్టూనే చాలామంది ఉంటారు. ఇది 255 ఏళ్ల నాటి ఒక ఫేమస్ సైకలాజికల్ ట్రాప్ అని నిపుణులు చెప్తున్నారు. అసలు ఇది ఎలా ఉంటుందంటే..

ప్రముఖ పారిశ్రామికవేత్త, పెట్టుబడి సలహాదారు అయిన డా. రితేష్ మాలిక్ లింక్డ్‌ఇన్‌లో ఇటీవల ఒక పోస్ట్ రాశారు. ఆ పోస్ట్‌లో మనమంతా డబ్బు విషయంలో చేసే కొన్ని పొరపాట్ల గురించి ఫన్నీగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. ఇందులో డైడెరో ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా ఉదాహరణతో సహా అర్థం అవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే..
కాస్ట్లీ సోఫా ఎఫెక్ట్!
మా సోదరి ఒక ఖరీదైన సోఫా కొనుక్కుంది. దాని ధర దాదాపు ₹2.8 లక్షలు. ఆ సోఫా ఇంటికి వచ్చాక... ఆమెకు పాత వస్తువులేవీ నచ్చట్లేదు. ఇంట్లో మిగతా వస్తువులేవీ దీనికి మ్యాచ్ అవ్వడం లేదు అనుకుంది. అంతే! ఆరు నెలల్లో, ఆమె అదనంగా ₹1.45 లక్షలు ఖర్చు చేసింది. కొత్త కాఫీ టేబుల్, కొత్త కర్టెన్లు, కొత్త లైటింగ్ సెటప్, కొత్త ఫ్లోర్ మ్యాట్ కొనేసింది. ఇప్పుడు సోఫాకు తగ్గట్టు గోడలకు కూడా కొత్త రంగు కూడా వేయించాలి అంటోందట. ఈ పోస్ట్ చదవడానికి ఫన్నీగా ఉన్నా.. దీనివెనుక డైడెరో ఎఫెక్ట్ కాన్సెప్ట్ దాగి ఉంది.
డైడెరో ఎఫెక్ట్ అంటే..
కొత్త వస్తువు కొనగానే దానికి తగ్గట్టుగా అన్ని వస్తువులను మార్చే అలవాటును డైడెరో ఎఫెక్ట్ అంటారు. ఇది 1769లో మొదలైంది. ఒక ఫ్రెంచ్ పండితుడికి ఒక అందమైన గౌను బహుమతిగా వచ్చింది. ఆ గౌను ముందు తన పాత కుర్చీలు, డెస్క్ పాతగా కనిపించాయట. అంతే! ఆయన ఆ గౌను కోసం కొత్త ఫర్నిచర్ అంతా కొనేసి అప్పుల పాలయ్యాడు!
నేర్చుకోవాల్సింది ఇదే..
ఇలాంటి సైకాలజీని మనం చాలాసార్లు చూస్తుంటాం. మీరు ఒక మంచి వస్తువు కొన్నప్పుడు, అది మీ చుట్టూ ఉన్న మిగతా పాత వస్తువులను మార్చమని మనసును పదేపదే ప్రేరేపిస్తుంది. మనకు తెలియకుండానే ఒక ఖర్చు... మరో పది ఖర్చులకు దారి తీస్తుంది. ఉదాహరణకు కొత్త కారు కొనగానే దాని యాక్ససరీస్, సీటు కవర్లు కొనాలనిపిస్తుంది. కొత్త ఐఫోన్ కొనగానే దానికి తగ్గట్టు కొత్త ఐపాడ్స్, ఐవాచ్ వంటివి కొనాలనిపిస్తుంది. అలా తెలియకుండానే ఫైనాన్షియల్ గా నష్టపోతారు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఈ ట్రాప్ నుంచి బయట పడాలంటే..
డైడెరో ఎఫెక్ట్ బారిన పడి మీరు కూడా అప్పుల పాలు అవ్వకుండా ఉండాలంటే ఈ మూడు రూల్స్ పాటించండి
- 72 గంటల నియమం: రూ.10 వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే ముందు 3 రోజులు ఆగండి. ఆ తర్వాత కూడా ఆ వస్తువు నిజంగా అవసరం అనిపిస్తే అప్పుడు కొనండి.
- ఖర్చు అంచనా: ఏదైనా వస్తువు కొనాలనుకుంటే దానికి తోడుగా ఇంకా ఏమేం కొనాల్సి వస్తుందో అన్నీ కలిపి ముందే లెక్క కట్టండి. అది మీ బడ్జెట్ లో సరిపోతేనే ఆ వస్తువు కొనండి.
- వన్ ఇన్.. వన్ అవుట్: కొత్త షర్ట్ కొంటే, పాత షర్ట్ ఒకటి తీసేయండి. కొత్త వస్తువుకు ఇంట్లో స్థలం ఇస్తున్నప్పుడు, పాత వస్తువును తీసేస్తే కొనాలనే కోరిక తగ్గుతుంది.
కంట్రోల్ మీదే
ఒక వస్తువు కొత్తగా ఉంటే, మిగతావి పాతగా అనిపించడం మనసుకి సహజమైన లక్షణం. అది లోపం కాదు. అదొక సైకలాజికల్ ట్రిక్ అంతే. అయితే దీనివల్ల మీ జేబుకు బొక్క పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. కేవలం ఒక చిన్న టెంప్టేషన్ కోసం అప్పులు పాలు అవ్వడం తెలివైన నిర్ణయం కాదు కదా. కాబట్టి ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల సలహా.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications