ఆన్‌లైన్ ప్రాడ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వాన్స్డ్ యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్, మీ పీసీలోని భద్రతా లోపాలను గుర్తించడం, సెక్యూర్ కనెక్షన్, రెప్యూటెడ్ వెబ్ సైట్స్‌తో డీల్ చేయడం, ఆన్ లైన్ షాపింగ్స్ కోసం క్రెడిట్ కార్డ్ వంటివి ఉపయోగించడం, మీ వ్యక్తిగత ట్రాన్సాక్షన్స్ కోసం బహిరంగ కంప్యూటర్లను వినియోగించకుండా ఉండటం, బలమైన, ఇతరులు గుర్తించలేని విధంగా పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం.. ఇలా అన్ లైన్ సేఫ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎన్నో టిప్స్, ట్రిక్స్ అవసరం.

ప్రయివేటు ద్వారానే
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహణకు పబ్లిక్ నెట్ వర్క్‌కు లేదా పబ్లిక్ కంప్యూటర్లకు దూరంగా ఉండటం మంచిది. మీ సొంత ల్యాపీ లేదా కంప్యూటర్ లేదా మొబైల్ వినియోగించాలి. పబ్లిక్ హాట్ స్పాట్స్, హోటళ్లలోని వైఫై, ఎయిర్ పోర్ట్స్ వంటి వాటిలో పబ్లిక్ నెట్ వర్క్ ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించడాన్ని పక్కన పెట్టాలనేది నిపుణుల సూచన. వీటి ద్వారా హ్యాకర్లు చాలా సులభంగా బ్యాంకింగ్ ఖాతాలకు సంబంధించిన కీలక డేటాను దొంగిలించవచ్చునని చెబుతున్నారు. అందుకే మీ మొబైల్ ఫోన్‌తో అనుసంధానమై ఉన్న పాస్ వర్డ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడం సముచితం.

బలమైన పాస్ వర్డ్
ఆన్ లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహణ కోసం బలమైన పాస్ వర్డ్ ఉండాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెక్యూరిటీ కోసం ఇదే మొదటి అంశం. మీరు సులభమైన పాస్ వర్డ్‌ను వినియోగిస్తే గుర్తించడం ఈజీ అవుతుంది.
బ్యాంకు ప్రతినిధిని అని లేదా ఆర్థిక సంస్థ ప్రతినిధిని అంటూ మీ ఖాతా నెంబర్, పాస్ వర్డ్, ఫోన్ నెంబర్, అడ్రస్, క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగితే చెప్పవద్దని సూచిస్తున్నారు.

పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్
సైబర్ క్రిమినల్స్ వైరస్‌లను, మాల్వేర్‌లను డెవలప్ చేస్తారు. ఇవి మీ కంప్యూటర్లను, బ్రౌజర్లను మానిప్యులేట్ చేస్తాయి. ఇవి మీ పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ పైన అటాక్ చేస్తాయి. మీ పీసీని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఇది భద్రతాస్థాయిని గుర్తించడంలో సహకరిస్తుంది.
అన్ని సమయాల్లోను HTTPsతో ప్రారంభమయ్యే వెబ్ సైట్లతో మాత్రమే తప్పనిసరిగా మీ వ్యక్తిగత, ఫైనాన్షియల్ సమాచారం నమోదు చేయాలి. HTTPతో మొదలయ్యే వెబ్ సైట్ల కనెక్షన్లకు మాత్రమే సెక్యూర్ సాకెట్ లేయర్ ఉంటుంది.

అప్పుడే సురక్షితం
మీ ఫోన్లో లేదా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో ఏదేనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆ యాప్స్ ఆర్థికేతరమైనవి అయినా ఎల్లవేళలా అవి కంపెనీలు అధికారికంగా ప్రారంభించిన యాప్‌లు అయినా చెక్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్లోని స్టోర్స్‌లోకి వెళ్లి అందుబాటులోని యాప్ స్టోర్ నుండి బ్యాంకింగ్, షాపింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అంటున్నారు. అలాంటి అధికారిక యాప్స్ మాత్రమే ఎన్‌క్రిప్టెడ్ సమాచారాన్ని కలిగి ఉంటాయి. అప్పుడే మీ ట్రాన్సాక్షన్ సురక్షితమవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications