మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. అయితే అందరూ చేసే సాధారణ ఇన్వెస్ట్‌మెంట్ కంటే కొంచెం భిన్నంగా ఆలోచించి, భారీ లాభాలు గడించాలనుకునే వారు సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ (sectoral mutual funds) వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 నూతన సంవత్సరంలో మార్కెట్ గమనాన్ని బట్టి ఏ రంగాలు పుంజుకుంటాయో విశ్లేషకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సెక్టోరల్ ఫండ్స్ అంటే ఏమిటి?
సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్స్ అంటే.. ఒక నిర్దిష్ట రంగానికి చెందిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్. ఉదాహరణకు, మీరు 'టెక్నాలజీ ఫండ్' ఎంచుకుంటే.. ఆ ఫండ్ మేనేజర్ కేవలం ఐటీ కంపెనీల షేర్లలోనే మీ డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ఆ రంగం బాగా రాణిస్తే మీకు సాధారణ ఫండ్స్ కంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కానీ ఆ రంగం కుదేలైతే నష్టం కూడా అంతే వేగంగా ఉంటుంది. అందుకే దీనిని 'హై రిస్క్ - హై రివార్డ్' ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు.
2026లో కాసుల వర్షం కురిపించే టాప్ సెక్టార్లు..
నిపుణుల విశ్లేషణ ప్రకారం 2026లో ఈ క్రింది రంగాలు దూసుకుపోయే అవకాశం ఉంది..
1. కంజప్షన్ థీమ్ (Consumption): భారతీయుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. రిటైల్, ట్రావెల్, హస్పిటాలిటీ వంటి రంగాలు 2026లో టాప్ గేర్‌లో ఉండబోతున్నాయి. ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఈ కంపెనీలకు లాభంగా మారుతుంది.
2. డిఫెన్స్ & రెన్యువబుల్ ఎనర్జీ: కేంద్ర ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా', 'గ్రీన్ ఎనర్జీ'కి ఇస్తున్న ప్రాధాన్యతతో డిఫెన్స్, సోలార్ ఎనర్జీ రంగాల్లోని కంపెనీల షేర్లు రికార్డు స్థాయి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది.
3. బ్యాంకింగ్ & NBFC: ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU Banks), ఫైనాన్స్ కంపెనీల పనితీరు 2026లో అద్భుతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని షేర్లు రెండంకెల వృద్ధిని నమోదు చేయవచ్చు.
4. ఆటోమొబైల్: ఎలక్ట్రిక్ వాహనాల (EV) జోరు పెరుగుతుండటంతో ఆటో రంగానికి చెందిన సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ (sectoral mutual funds) ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కాబట్టి వచ్చే ఏడాది ఈ సెక్టర్ కీలకం కానుంది.
ఇన్వెస్టర్లకు నిపుణుల హెచ్చరిక!
రిస్క్ ఉన్న చోటే లాభం ఉంటుంది అని నిపుణులు తరచూ చెబుతుంటారు. అయితే మీ మొత్తం పెట్టుబడిని సెక్టోరల్ ఫండ్స్‌లో పెట్టడం ప్రమాదకరం. మీ పోర్ట్‌ఫోలియోలో కేవలం 10-15% మాత్రమే ఇలాంటి ఫండ్స్‌కు కేటాయించాలి. మిగిలిన మొత్తాన్ని లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో ఉంచడం ద్వారా రిస్క్‌ను బ్యాలెన్స్ చేయవచ్చు.
మొత్తంగా 2026లో మార్కెట్ అనిశ్చితులు ఉన్నప్పటికీ, సరైన సెక్టార్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా లాభపడడం అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి సరైన ఆర్థిక నిపుణుడి సలహా మేరకు ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి)


Click it and Unblock the Notifications