సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సంక్లిష్టంగా, భయపెట్టేదిగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్ల ద్వారా జమ చేయబడిన డబ్బు మ్యూచువల్ ఫండ్ అవుతుంది. ఈ ఫండ్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహిస్తారు. ఒక ట్రస్ట్ ద్వారా ఒకే విధమైన పెట్టుబడి ఉద్దేశ్యమున్న చాలామంది ఇన్వెస్టర్ల నుండి డబ్బును సేకరిస్తారు.
ఆ తర్వాత ఈ ఫండ్‌ను ఈక్విటీలు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్ లేదా సెక్యూరిటీస్‌లలో పెట్టుబడి పెడుతుంది. ప్రతి ఇన్వెస్టర్‌కు యూనిట్లు సొంతగా ఉంటాయి. ఇది ఫండ్ హోల్డింగ్ భాగాన్ని తెలుపుతుంది. ఈ సంయుక్త పెట్టుబడి నుండి వచ్చిన ఆదాయం/లాభాలు నిర్దిష్ట ఖర్చులు తీసివేసిన తర్వాత స్కీం నికర ఆస్తి వ్యాల్యూ లేదా ఎన్ఏవీని లెక్కించి పంపిణీ చేస్తారు.

బెస్ట్ పర్ఫార్మింగ్ లిక్విడ్ ఫండ్స్
దేశంలో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 1963 నుండి మన దేశంలో ఉంది. నేడు పదివేలకు పైగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పెట్టుబడిదారు భారత్‌లోని మ్యూచువల్ ఫండ్స్ రకాలను తెలుసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ సహా వివిధ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్, క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మూడు బెస్ట్ పర్ఫార్మింగ్ లిక్విడ్ ఫండ్స్ గురించి తెలుసుకోండి....

ఈ ఫండ్స్‌తో మంచి రిటర్న్స్
పలు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ మనీ మార్కెట్ ఫండ్స్, బాండ్స్ సహా వివిధ డెట్ మార్కెట్ సాధనాల్లో 91 రోజుల లోపు ఇన్వెస్ట్ చేస్తాయి. షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్ కంటే ఇది ఉత్తమ మార్గం. ప్రస్తుతం భారత్‌లో బాండ్ యీల్డ్స్ తగ్గాయి. అయితే కరోనా తగ్గుదల, వ్యాక్సినేషన్ వివిధ అంశాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతం కావడానికి కారణమవుతున్నాయి. ఇది రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో బాండ్ యీల్డ్స్‌కు సానుకూల పరిణాంగా చెబుతున్నారు. మున్ముందు వడ్డీ రేట్లు క్రమంగా పెరిగే అవకాశముంది. డెట్ కేటగిరీలో లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికగా చెబుతున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుంది. వడ్డీ రేటు పెరుగుదలతో లిక్విడ్ ఫండ్స్ అధిక ధరను పొందుతాయి.

లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు ఏం చూడాలి?
మీరు స్వల్ప కాలానికి గాను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
మీ ప్రధాన పెట్టుబడులకు, అలాగే, రిటర్న్స్‌కు ఎలాంటి ప్రమాదం ఉండకూడదు.
ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటు కలిగిన బ్యాంకు డిపాజిట్లను ఎంచుకోవడానికి బదులు లిక్విడ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
ఈ మ్యూచువల్ ఫండ్ స్వల్పకాలిక పెట్టుబడి మార్గాన్ని అందించడంతో పాటు మూలధనం, మోడరేట్ ఆదాయానికి భద్రత.

టాప్ రేటెడ్ బెస్ట్ లిక్విడ్ ఫండ్స్
పెట్టుబడి కోసం టాప్ రేటెడ్ బెస్ట్ లిక్విడ్ ఫండ్స్ గురించి పరిశీలించండి. JM లిక్విడ్ ఫండ్ -డైరెక్ట్ (గ్రోత్) ప్లాన్. ఇది ఏడాది సిప్ పెట్టుబడి ద్వారా 3.32 శాతం రిటర్న్స్, మూడేళ్ల సిప్ ద్వారా 4.35 శాతం, అయిదేళ్ల సిప్ ద్వారా 5.28 శాతం రాబడిని అందించింది.
కెనరా రోబెకో లిక్విడ్ - రెగ్యులర్ ప్లాన్ - గ్రోత్. ఇది ఏడాది సిప్ పెట్టుబడి ద్వారా 3.18 శాతం రిటర్న్స్, మూడేళ్ల సిప్ ద్వారా 4.08 శాతం, అయిదేళ్ల సిప్ ద్వారా 6.39 శాతం రాబడిని అందించింది.
ఎడెల్విస్ లిక్విడ్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్-గ్రోత్. ఇది ఏడాది సిప్ పెట్టుబడి ద్వారా 3.48 శాతం రిటర్న్స్, మూడేళ్ల సిప్ ద్వారా 4.57 శాతం, అయిదేళ్ల సిప్ ద్వారా 5.44 శాతం రాబడిని అందించింది.
ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడినవి. వ్యాసం ఆధారంగా పెట్టుబడి కంటే, నిపుణుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది.
More From GoodReturns

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications