ఎన్నారైలకు సూపర్ ఛాన్స్! ఇండియాలో డబ్బులు దాచుకుంటే 8% వరకు వడ్డీ.. పైగా టాక్స్ ఫ్రీ!
విదేశాల్లో స్థిరపడిన మన భారతీయులు (NRIs) తాము కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా, ఎక్కువ లాభం వచ్చేలా ఎక్కడ దాచుకోవాలా అని చూస్తున్నారా? అయితే 2026 లో మీకు ఒక సూపర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, భారత రూపాయి విలువ స్థిరంగా ఉండటంతో ఎన్నారైలు మన దేశంలోని బ్యాంకుల్లో FD (ఫిక్స్‌డ్ డిపాజిట్) చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బ్యాంకులు ఎన్నారైల కోసం ఎన్‌ఆర్ఈ (NRE - Non-Resident External) స్థిర డిపాజిట్లపై ఏకంగా 6% నుండి 8% వరకు భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్ నియమ నిబంధనలు ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

ఎన్‌ఆర్ఈ (NRE) డిపాజిట్ల వల్ల లాభాలేంటి?
ఎన్నారైలు తమ విదేశీ సంపాదనను రూపాయిల రూపంలో మార్చుకుని ఇండియాలో దాచుకోవడానికి ఈ అకౌంట్లు ఉపయోగపడతాయి. దీనివల్ల రెండు ప్రధాన లాభాలు ఉన్నాయి..
- పూర్తిగా టాక్స్ ఫ్రీ: ఈ FD ల ద్వారా వచ్చే వడ్డీపై భారతదేశంలో ఎలాంటి ఆదాయపు పన్ను (Income Tax) కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులు దీనిపై ఎలాంటి టీడీఎస్ (TDS) కట్ చేయవు.
- సులువుగా వెనక్కి తీసుకెళ్లొచ్చు (Repatriation): మీరు డిపాజిట్ చేసిన అసలు సొమ్మును, దానికి వచ్చిన వడ్డీని ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి మీరు ఉంటున్న దేశానికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సాధారణ స్థిర డిపాజిట్లలాగా ఎన్‌ఆర్ఈ డిపాజిట్లలో సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఉండవు. 60 ఏళ్లు దాటిన వారికి కూడా మిగతా ఇన్వెస్టర్లతో సమానంగానే వడ్డీ లభిస్తుంది.
ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ ఇస్తున్నారు?
ప్రస్తుతం ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) అత్యధికంగా 8.05% వడ్డీ ఇస్తుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) సెలెక్టెడ్ టెన్యూర్‌లపై 7.99% వరకు ఆఫర్ చేస్తోంది. ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు 7% నుండి 7.5% రేంజ్‌లో వడ్డీని ఇస్తున్నాయి.
ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. కెనరా బ్యాంక్ 7.40% వరకు ఇస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకులు 6.5% నుండి 7.3% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఏడాది డిపాజిట్లపైనే కాకుండా, 2 నుండి 5 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లను ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
మధ్యలోనే డబ్బులు తీసేస్తే రూల్స్ చాలా కఠినం!
ఎన్‌ఆర్ఈ FD లలో డబ్బులు పెట్టే ముందు విత్‌డ్రాయల్ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు డిపాజిట్ చేసిన తేదీ నుండి ఏడాది (1 Year) పూర్తి కాకముందే అకౌంట్ క్లోజ్ చేస్తే, మీకు పైసా వడ్డీ కూడా రాదు. ఒక ఏడాది దాటిన తర్వాత, మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు తీసేస్తే.. బ్యాంకులు కొంత పెనాల్టీ విధించడమే కాకుండా, తక్కువ వడ్డీని మాత్రమే ఇస్తాయి.
ఇందులో మీకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. 'క్యుములేటివ్' పద్ధతిలో మెచ్యూరిటీ పూర్తయ్యాక అసలు, వడ్డీ కలిపి ఒకేసారి ఇస్తారు. 'నాన్-క్యుములేటివ్' పద్ధతిలో మీ అవసరాలను బట్టి నెలనెలా, మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వడ్డీని మీ అకౌంట్లో క్రెడిట్ చేసుకునే వీలుంది.


Click it and Unblock the Notifications