2022లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ క్రిప్టో కరెన్సీలు! పన్ను తగ్గించేనా?
ఇటీవల క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే డిజిటల్ కాయిన్ ట్రాన్సాక్షన్స్, లాభాలపై 30% పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. పన్ను నేపథ్యంలో క్రిప్టో మార్కెట్ కొద్ది రోజులుగా భారీ నష్టాల్లో కనిపించింది. అయితే ఇటీవల క్రమంగా కోలుకుంటోంది. పన్ను ప్రకటన వచ్చినప్పటికీ క్రిప్టో పెట్టుబడులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 2022లో నిపుణులు సూచిస్తున్న కొన్ని క్రిప్టోలను చూద్దాం.

ఇవి కొనుగోలు చేయవచ్చు
బెస్ట్ కొత్త క్రిప్టో లక్కీ బ్లాక్, ఇటీవలి కాలంలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన అవాలాంచె, డెఫి ఎక్స్‌పోజర్ ఎక్సిస్టింగ్ కొత్త క్రిప్టో మేకర్, లాంగ్ టర్మ్ వ్యాల్యూ పరంగా బెస్ట్ ఆల్ట్ కాయిన్ ఎథేరియం, యూనిక్ యూజ్ అయితే చైన్ లింక్, వీటితో పాటు యూనిస్వాప్, ఎంజిన్, బేసిక్ అటెన్షన్ టోకెన్, యెర్న్ ఫైనాన్స్, సోలానా వంటి క్రిప్టోలను రిఫర్ చేస్తున్నారు.

పన్నులు
డిజిటల్ ఆస్తులు లేదా డిజిటల్ అసెట్స్‌పై లాభాలు సమకూరితే పన్ను ఎంత చెల్లించాలన్న అంశంపై ఇప్పటి వరకు చట్టపరంగా నిర్దేశించలేదు. పన్నుకు సంబంధించి గందరగోళం నెలకొంది. దీంతో కొందరు క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్‌టీ వాటి విక్రయం ద్వారా ఆర్జించిన లాభాలను రిటర్న్స్‌లో చూపించట్లేదు. కొందరు రిటర్న్స్‌లో చూపించినా డెట్ సాధనాలకు వలె పన్ను చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అసెట్స్ పైన పన్నుపరంగా అస్పష్టతకు నిర్మలమ్మ బడ్జెట్‌లో 30 శాతం పన్నును విధిస్తూ గందరగోళానికి తెరదించారు.
కొనుగోలు కోసం చేసిన వ్యయం మినహా లాభం నుండి మినహాయింపులేదు. డెట్ సాధనాలను మూడేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభం నుండి ద్రవ్యోల్భణాన్ని తీసేసి, మిగిలిన దానిపై పన్ను చెల్లించాలి. అటువంటి ప్రయోజనం డిజిటల్ అసెట్స్ లాభాలపై లేదు. అలాగే, లాభనష్టాల సర్దుబాటుకు అవకాశం లేదు. డిజిటల్ అసెట్స్‌ను మరొకరికి బదలీ చేసినా విక్రయంగా పరిగణిస్తారు.

క్రిప్టో ఇండస్ట్రీ విజ్ఞప్తి
డిజిటల్ అసెట్స్/క్రిప్టో పైన 30 శాతం పన్ను విధించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై క్రిప్టో ఇండస్ట్రీ కాస్త అసంతృప్తితో ఉంది. ట్రాన్సాక్షన్ పన్నును తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. 30 శాతం పన్ను రేటుతో పాటు అదనంగా 1 శాతం టీడీఎస్ ఉంది. వీటిని తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ కోరనుంది.


Click it and Unblock the Notifications