గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేటు..ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఓ లుక్కేసుకోండి

2025 ప్రారంభం నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 1% తగ్గించింది. ఇప్పుడు హోం లోన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్లకి గోల్డెన్ ఛాన్స్‌. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గడం, ఈఎంఐలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి.. ఇప్పటి వరకు గృహ రుణాల కోసం బ్యాంకులను ఎక్కువగా ఎంచుకునేవారు, ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) కూడా మంచి అప్షన్‌లుగా నిలుస్తున్నాయి.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCs) అంటే ఏమిటి? ఇది ప్రత్యేకించి గృహ మరియు హౌసింగ్ సంబంధిత రుణాలకు సేవలందిస్తాయి. మొదట్లో ఈ HFCలను NHB (నేషనల్ హౌసింగ్ బ్యాంక్) పర్యవేక్షించేది, కానీ 2019 నుండి RBI వాటిని నియంత్రించటం ప్రారంభించింది .

Home Loans 2025 Low Interest Home Loans India Housing Finance Companies Best Home Loan Rates India EMI Loan Offers Home Loan Eligibility Required Documents for Home Loan Home Loan Interest Rates June 2025 Bajaj Housing Loan LIC Housing Loan Rate Green Home Loan Offers Credit Score for Home Loan Home Loan Approval Process Daily Reducing Balance Loan Non-bank Home Loan Offers 2025 2025 EMI 750 -

ప్రస్తుత హోం లోన్ వడ్డీ రేట్లు (2025 జూన్ 18 నాటికి):

సంస్థ పేరు వడ్డీ (%) ప్రారంభం
bajaj Housing Finance 7.99%
LIC Housing Finance 8.00%
PNB Housing Finance 8.25-14.50%
Aditya Birla Capital 8.50%
Godrej Housing Finance 8.55%
Tata Capital 8.75%
Sammaan Capital 8.75%
ICICI Home Finance 8.80%
GIC Housing Finance 8.80%
SMFG India Home Finance* 10.00%

మహిళలకు లేదా గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్ట్స్‌కు అదనంగా 0.05% - 0.10% తగ్గింపు వడ్డీ లభిస్తుంది.

హోం లోన్ దరఖాస్తు కు అవసరమైన డాక్యుమెంట్లు:
పాన్ కార్డు, ఆధార్ కార్డు

నివాస ధృవీకరణ పత్రాలు

NRI అయితే పాస్‌పోర్ట్

ఆదాయ పత్రాలు:

ఉద్యోగస్తులకు: జీతపు స్లిప్పులు, ఫారం 16

స్వయం ఉపాధిగలవారికి: గత 3 సంవత్సరాల ITR, బ్యాలెన్స్ షీట్‌లు

బ్యాంక్ స్టేట్మెంట్ - గత 6-12 నెలల వరకు

ఆస్తికి సంబంధించిన పత్రాలు:

ఆస్తి యాజమాన్య ధృవీకరణ పత్రాలు

బిల్డర్ లేదా సొసైటీ నుండి ఆలాట్‌మెంట్ లెటర్

పన్ను చెల్లింపు రసీదులు

సులభంగా గృహ రుణం పొందాలంటే: మీ క్రెడిట్ స్కోర్ 750 కి పైగా ఉంటే మంచి వడ్డీ రేటు లభిస్తుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు (ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ ఛార్జీలు) కంపెనీల మధ్య పోల్చుకోండి. EMI మీ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉందో లేదో చూసుకోండి.LIC Housing Finance వంటి సంస్థలు వడ్డీని "డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్" పద్ధతిలో లెక్కిస్తాయి. అంటే, మీరు ప్రతి EMI లేదా అడ్వాన్స్ చెల్లింపు చేసినప్పుడు లోన్ మొత్తంలో మిగిలిన బ్యాలెన్స్ మీద మాత్రమే వడ్డీ లెక్కించబడుతుంది. ఇది వడ్డీ మొత్తాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

అంతేకాక, మీరు గృహాన్ని ఎంపిక చేసుకునే ముందు మీ ఆదాయం, రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి సంస్థలు "ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్" ఇస్తాయి. ఇది 6 నెలల పాటు వర్తిస్తుంది. దీని వల్ల మీరు సమయానికి గృహం ఎంపిక చేసుకోవచ్చు. హోం కొనుగోలు, నిర్మాణం, లేదా విస్తరణ కోసం తీసుకునే రుణాన్ని గరిష్టంగా 30 సంవత్సరాల లోపు, అలాగే మరమ్మత్తులు లేదా అల్టరేషన్‌ల కోసం గరిష్టంగా 15 సంవత్సరాల లోపు EMI ల రూపంలో తిరిగి చెల్లించాలి.

ఇప్పుడు తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్, ఎక్కువ జీతం లేకపోయినా, మీరు నాన్-బ్యాంక్ కంపెనీల ద్వారా తక్కువ వడ్డీ తో లోన్ తీసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారుతూ ఉంటాయి కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవడం మంచిది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+