ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పైగా పెరిగాయి. అంతర్జాతీయంగా US డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతల అంచనాలు, ప్రపంచంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా పెట్టుబడిదారులకు బంగారం మళ్ళీ నాణ్యమైన పెట్టుబడిగా నిలిచింది.
ఈ ఏడాది పెట్టుబడిదారులు బంగారం ETFల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆగస్టులో రూ. 2,190 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులు వచ్చాయి. మొత్తం గోల్డ్ ETFలలో సంచిత పెట్టుబడులు (AUM) రూ. 5,648 కోట్లకు చేరాయి. గత ఏడాది రూ. 37,390 కోట్లే ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య రూ. 72,496 కోట్లకు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 94 శాతం పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల బంగారం పై విశ్వాసాన్ని సూచిస్తుంది.

2025లో అత్యధిక లాభాలు పండించిన గోల్డ్ ETFలు
1. HDFC గోల్డ్ ETF: గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 38.01 శాతం లాభం. గత 5 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 14.98 శాతం లాభం ఇచ్చింది. 10 సంవత్సరాల్లో సగటు రాబడి 12.69 శాతంగా ఉంది.
2. యాక్సిస్ గోల్డ్ ETF: గత ఏడాది 38.05 శాతం లాభం. 5 సంవత్సరాల్లో వార్షిక సగటు లాభం 14.15 శాతం కాగా.. 10 సంవత్సరాల్లో 12.44 శాతం లాభాన్ని పెట్టుబడిదారులు అందుకున్నారు.
3. ICICI ప్రుడెన్షియల్ గోల్డ్ ETF: 38.06 శాతం లాభం గత సంవత్సరం అందుకోగా మొత్తంగా 5 సంవత్సరాల కాలంలో వార్షిక లాభం 14 శాతం ఇచ్చింది. ఇక 10 సంవత్సరాల లాభం 12.59 శాతంగా ఉంది.
4. UTI గోల్డ్ ETF: పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. గతేడాది 38.73 శాతం లాభం రాగా 5 సంవత్సరాల కాలంలో వార్షిక లాభం 14 శాతానికి చేరింది. 10 సంవత్సరాల లాభం 12.72 శాతంగా ఉంది.
ఈ ఫండ్లు పెట్టుబడిదారులకు నేరుగా బంగారం కొనకుండానే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి మార్గాన్ని అందిస్తున్నాయి. అందులోని ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. ఫిజికల్ బంగారం కొనాల్సిన అవసరం లేకుండా.. మార్కెట్ ద్వారా ఈ ఎటీఎఫ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. అదనంగా నిల్వ ఖర్చులు లేదా భద్రతాపరమైన సమస్యలు ఉండవు.
అయితే ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నందున, ఈ లాభాలను చూసి భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రమాదం కూడా కావచ్చు. ఇది చాలా వేగంగా మారే మార్కెట్ కాబట్టి, చిన్న భాగాలుగా క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఏదేమైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడంలో ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలని చాలా కీలకం. ఏదైనా పెట్టుబడికి ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, మినహాయింపు, కాల అవధిని బట్టి శ్రద్ధగా ఆలోచించాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications