Fuel Credit Cards: రూ.120కి పెరగనున్న పెట్రోల్! ఈ కార్డ్స్ ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో ఎన్నికల కారణంగా గత నాలుగు నెలలుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి రెండో వారంలో ధరలు రూ.10 నుండి రూ.20 వరకు పెరిగే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నాలుగు నెలల క్రితం క్రూడ్ ధరలు 70 డాలర్ల వద్ద ఉంది. కానీ ఇప్పుడు 40 డాలర్ల వరకు పెరిగి 110 డాలర్లకు చేరుకున్నాయి. అంటే ఈ కాలంలో ధరలు 50 శాతం పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు గత 4 నెలలుగా పెరిగిన భారాన్ని మోస్తున్నాయి. కాబట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ధరలు భారీగా పెరగవచ్చు. అయితే పెరిగిన భారాన్ని వినియోగదారులు తగ్గించుకోవచ్చు. అయితే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ఉపయోగించేవారు వివిధ ఫ్యూయల్ కార్డ్స్‌ను వినియోగించి కాస్త భారం తగ్గించుకోవచ్చు.

ఫ్యూయల్ ఆధారిత క్రెడిట్ కార్డ్స్

ఫ్యూయల్ ఆధారిత క్రెడిట్ కార్డ్స్

ఇప్పటికే అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో లీటర్ పెట్రోల్ రూ.120కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనం ఖర్చును ఆదా చేయడానికి ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చు. దేశంలో అన్ని ప్రధాన బ్యాంకులు ఫ్యూయల్ ఆధారిత క్రెడిట్ కార్డ్స్ అందిస్తున్నాయి. బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి రిటైలర్ల భాగస్వామ్యంతో ఆర్థిక సంస్థలు కార్డులు అందిస్తున్నాయి. ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌తో భాగస్వామ్య సంస్థ ఇంధన పంపుల వద్ద కొనుగోళ్లు చేస్తే ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రయాణానికి తమ సొంత వాహనాలను ఉపయోగించేవారు ఈ కార్డుల ద్వారా ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయవచ్చు. ఇంధన ఆధారిత క్రెడిట్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఈ విధానంలో కార్డు ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన ప్రతిసారి మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. వీటిని తిరిగి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని కార్డ్స్ సర్‌ఛార్జ్ మినహాయింపుకు ఉపయోగపడతాయి.

బెస్ట్ ఫ్యూయల్ ఆధారిత 7 క్రెడిట్ కార్డ్స్

బెస్ట్ ఫ్యూయల్ ఆధారిత 7 క్రెడిట్ కార్డ్స్

BPCL SBI కార్డ్ ఆక్టేన్,

Indian Oil Citibank Platinum క్రెడిట్ కార్డు,

Indian Oil Axis Bank క్రెడిట్ కార్డు,

HDFC Bharat Cash back క్రెడిట్ కార్డు,

BPCL SBI కార్డు,

IndianOil HDFC క్రెడిట్ కార్డు,

ICICI HPCL కోరల్ క్రెడిట్ కార్డు ఉన్నాయి.

బీపీసీఎల్-ఎస్బీఐ కార్డు

బీపీసీఎల్-ఎస్బీఐ కార్డు

బీపీసీఎల్-ఎస్బీఐ కార్డు తీసుకుంటే తొలిసారి లభించే ప్రయోజనాలు రూ.500 వ్యాల్యూ చేసే 2000 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో 13X పాయింట్లు లభిస్తాయి. 4 రివార్డ్ పాయింట్లు రూ.1 విలువ చేస్తాయి. బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో ప్రతి నెల రూ.100 వరకు సర్‌ఛార్జీ రద్దు చేస్తారు. ఏటా 70 లీటర్ల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. డైనింగ్, నిత్యావసరాలు, సినిమా టిక్కెట్లు, డిపార్టుమెంట్ స్టోర్స్‌లో చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇంధనేతర ఉత్పత్తులపై చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది. బిల్లు రూ.2500 మించితే వాయిదాలుగా మార్చుకోవచ్చు. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.499. వార్షిక రుసుము రూ.500. నెలవారీ ఫైనాన్స్ ఛార్జీలు 3.50 శాతం.

ఇండియన్ ఆయిల్-సిటీ కార్డు

ఇండియన్ ఆయిల్-సిటీ కార్డు

ఇండియన్ ఆయిల్-సిటీ కార్డు తీసుకున్న నెల రోజుల్లో చేసే మొదటి వ్యయంపై రూ.250 టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో చేసే ప్రతి రూ.150 వ్యయంపై నాలుగు టర్బో పాయింట్లు లభిస్తాయి. నిత్యావసరాలు, సూపర్ మార్కెట్లలో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై రెండు టర్బో పాయింట్లు లభిస్తాయి. డైనింగ్, షాపింగ్ కోసం చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 1 టర్బో పాయింట్ లభిస్తుంది. ఫీచర్డ్ పార్ట్‌నర్ స్టోర్‌లో చేసే ప్రతి రూ.150 వ్యయంపై 4X టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇంధన ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం సర్‌ఛార్జీ రద్దు చేస్తారు. జాయినింగ్ ఫీజు రూ.1000, వార్షిక రుసుము రూ.1000 ఉంటుంది. వార్షిక వ్యయం రూ.30,000 దాటితే జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు రద్దవుతుంది. నెలవారీ ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతం, ప్రతి సంవత్సరం 70 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు.

ఇండియన్ ఆయిల్-యాక్సిస్ బ్యాంకు కార్డు

ఇండియన్ ఆయిల్-యాక్సిస్ బ్యాంకు కార్డు

కార్డు తీసుకున్న మొదటి నెల రోజుల్లో చేసే మొదటి వ్యయంపై 100 శాతం గరిష్టంగా రూ.250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో ప్రతి రూ.100 ట్రాన్సాక్షన్ పైన 20 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇంధన వ్యయంపై నాలుగు శాతం వరకు వెనక్కి వస్తుంది. ప్రతి నెల రూ.100 ఖర్చు చేయాలి. రూ.200 నుండి రూ.5000 మధ్య చేసే ట్రాన్సాక్షన్ పైన 1 శాతం సర్‌ఛార్జీ రద్దు ఉంటుంది. ఆన్ లైన్ షాపింగ్ కోసం చేసే రూ.100 ఖర్చుపై ప్రతిసారి 5 రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్య రెస్టారెంట్లలో చేసే డైనింగ్ బిల్లుపై 20 శాతం రాయితీ ఉంటుంది. కార్డు జాయినింగ్ ఫీజు రూ.500, వార్షిక రుసుము రూ.500. క్రితం ఏడాది ఖర్చులు రూ.50,000 మించితే వార్షిక రుసుము రద్దవుతుంది. నెలవారీ ఫైనాన్స్ ఛార్జీలు 3.40 శాతం ఉంటుంది. ప్రతి సంవత్సరం 70 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ - భారత్ క్యాష్ బ్యాక్ కార్డు

హెచ్‌డీఎఫ్‌సీ - భారత్ క్యాష్ బ్యాక్ కార్డు

పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, IRCTC ట్రాన్సాక్షన్స్, మొబైల్ రీచార్జ్ సహా ఇతర బిల్లు చెల్లింపులపై నెలకు 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పెట్రోల్ పంపుల్లో కనీసం రూ.400 వరకు చేసే ట్రాన్సాక్షన్ పైన 1 శాతం సర్ ఛార్జ్ రద్దు ఉంటుంది. గరిష్టంగా రూ.250 వరకు ప్రయోజనం ఉంది. జాయినింగ్ ఫీజు రూ.500, వార్షిక ఫీజు రూ.500. నెలవారీ ఫైనాన్స్ ఛార్జీలు 3.49 శాతం.

అప్పుడే ప్రయోజనం

అప్పుడే ప్రయోజనం

క్రెడిట్ కార్డులో వడ్డీ రహిత కాలం పరిమితం. గడువులోగా చెల్లించకుండే వడ్డీ 28 శాతం నుండి 49 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ఈ కార్డు మీకు అధిక భారంగా కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉండటంతో పాటు ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి. అప్పుడు ప్రయోజనం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+