థీమాటిక్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ నిర్దిష్ట థీమ్‌కు సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ సెక్టోరియల్ ఫండ్స్ కంటే చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఒక సాధారణ థీమ్ ద్వారా లింక్ చేయబడిన సంస్థలు, రంగాలలో పెట్టుబడులు పెడతాయి. ఈ ఫండ్స్ ప్రధానంగా డివిడెండ్ చెల్లించే ఈక్విటీలలో పెట్టుబడి పెడతాయి. సకాలంలో డివిడెండ్స్ చెల్లించిన చరిత్ర కలిగిన కంపెనీలకు ఇది ప్రాధాన్యతను ఇస్తుంది. కొన్ని డివిడెండ్స్ చూడండి....
యూటీఐ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
యూటీఐ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అసెట్స్ రూ.3,177 కోట్లు. ఫండ్స్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.49 శాతంగా ఉంది. యూటీఐ డివిడెండ్ యీల్డ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ పైన వన్ ఇయర్ రిటర్న్స్ 73.55 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి ఏడాదికి సగటు రిటర్న్స్ 14.68 శాతంగా ఉంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్, ఎంపయాసిస్ లిమిటెడ్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్ టాప్ ఫైవ్ హోల్డింగ్స్.

టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కం ఫండ్ గ్రోత్
టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కం ఫండ్ గ్రోత్ ఏఎంయూ రూ.1,169 కోట్లు. ఫండ్ కాస్ట్ రేషియో 2.31 శాతం. టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కం ఫండ్ ఏడాది గ్రోత్ రేట్ 76.40 శాతంగా ఉంది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున 14.26 శాతం రిటర్న్స్ అందించింది. టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఆదాయ ఫండ్ ఎన్ఏవీ సెప్టెంబర్ 24, 2021 నాటికి 77.58గా ఉంది.
ప్రిన్సిపల్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్
ప్రిన్సిపల్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ టోటల్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ రూ.238 కోట్లు. ఫండ్ కాస్ట్ రేషియో 2.15 శాతం. థీమాటిక్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్స్ సగటు రిటర్న్స్ కంటే ఇది ఎక్కువ. ఏడాది రిటర్న్స్ 67.25 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 15.09 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ యీల్డ్స్ ఈక్విటీ ఫండ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ యీల్డ్స్ ఈక్విటీ ఫండ్ గ్రోత్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ రూ.446 కోట్లు. ఇది మీడియం సైజ్ ఫండ్ కేటగిరీకి చెందినది. ఫండ్ కాస్ట్ రేషియో 2.83 శాతం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ యీల్డ్స్ ఈక్విటీ ఫండ్ గత ఏడాది రిటర్న్స్ 80.17 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 13.73 శాతంగా ఉంది.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్ గ్రోత్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ రూ.865 కోట్లు. మీడియం సైజ్డ్ ఫండ్ కేటగిరీ. ఫండ్ కాస్ట్ రేషియో 2.44 శాతం. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ యీల్డ్స్ ఫండ్ ఏడాది గ్రోత్ రేట్ 62.81 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున 19.00 శాతంగా ఉంది. ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నది. వీటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు పూర్తిగా అవగాహన చేసుకొని, ఇన్వెస్ట్ చేయాలి. ఈ పెట్టుబడులు మార్కెట్ ఆధారిత రిటర్న్స్ ఇస్తాయి. నిపుణుల సలహాలు, మార్కెట్ పైన అవగాహనతో పెట్టుబడి పెట్టడం మంచిది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications