రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూశారు. ఈ పరిణామాలు క్రిప్టో కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపాయి. బిట్ కాయిన్, ఎథేరియం సహా దాదాపు అన్ని క్రిప్టోలు కూడా పతనమయ్యాయి. అయితే రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ కాస్త తగ్గుతారనే అంచనాలతో మార్కెట్లు కాస్త కుదురుకున్నాయి. క్రిప్టో మార్కెట్ కూడా తిరిగి యుద్ధం ముందు నాటి స్థాయికి చేరుకుంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో క్రిప్టో మార్కెట్ పడిపోయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. మార్కెట్లోకి ఎన్నో క్రిప్టోలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేయడానికి 12 బెస్ట్ పాత, కొత్త క్రిప్టోలను చూద్దాం.

టాప్ 12 క్రిప్టోలు
ఇన్వెస్ట్ చేయడానికి టెన్ బెస్ట్ క్రిప్టోల విషయానికి వస్తే లక్కీ బ్లాక్ (LBLOCK), ఎథేరియం (ETH), డీసెంట్రలాండ్ (LAND), కార్డానో (ADA), కార్డానో (ADA), బియాన్స్ కాయిన్ (BNB), యాక్సీ ఇన్‌ఫినిటీ (AXIE), పాలీగాన్ (MATIC), అవాలాంచె (AVAX), రిప్పిల్ (XPR), స్టెల్లార్(XLM), కర్వ్ (CRV) ఉన్నాయి.

లాంగ్ టర్మ్ కోసం బియాన్స్
- ప్రస్తుతం లక్కీ బ్లాక్ క్రిప్టో గత కొంతకాలంగా లాభపడుతోంది. దీనిని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఉండవచ్చునని క్రిప్టో మార్కెట్ వర్గాల అంచనా.
- ప్రస్తుతం ఎథేరియం కొద్ది నెలల కనిష్టం వద్ద ఉంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ కోసం కొనుగోలు చేయడానికి ఆశాజనకమైన క్రిప్టో అని చెబుతున్నారు.
- డీసెంట్రలాండ్ తక్కువ ఖరీదుతో కనుగోలు చేయవచ్చు. ఇది నేడు 17 శాతం లాభపడింది. 52 వారాల కనిష్టం 0.222614 డాలర్లు కాగా, గరిష్టం 5.90 డాలర్లు.
- కార్డానో నేడు 11 శాతానికి పైగా లాభపడింది. ఇది కూడా తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆల్ టైమ్ గరిష్టం 3.10 డాలర్లకు చాలా దూరంలో (0.850732 డాలర్లు) ఉంది.
- బియాన్స్ కాయిన్ లాంగ్ టర్మ్ గెయిన్స్ కోసం మంచి క్రిప్టోగా సూచిస్తున్నారు.

వినూత్న బ్లాక్ చైన్ గేమింగ్
- యాక్సీ ఇన్ఫినిటీ వినూత్న బ్లాక్ చైన్ గేమింగ్ ప్రాజెక్టు. ఈ క్రిప్టో కొనుగోలను పరిగణలోకి తీసుకోవచ్చు.
- పాలీగాన్ భారీ స్కేలబిలిటీతో 2022లో కొనుగోలు చేయడానికి ఇదో కొత్తక్రిప్టో.
- అవాలాంచె వినూత్న బ్లాక్ చైన్ ప్లాట్‌ఫామ్.
- రిప్పిల్ లేదా ఎక్స్‌ఆర్‌పీ దీర్ఘ, పెద్ద ఆశయాలతో కూడిన టాప్ క్రిప్టో ప్రాజెక్టు.
- స్టెల్లార్ కొత్త క్రిప్టో చెల్లింపుల నెట్ వర్క్.
- డెఫి ఎక్స్‌పోజర్ కోసం కొనుగోలు చేయడానికి అత్యంత ఆదరణ పొందిన క్రిప్టో కర్వ్.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications