కరోనా మహమ్మారి తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ పరుగు పెట్టింది. ఆ తర్వాత భారీగా పతనమయ్యాయి కూడా. ఇటీవల క్రమంగా కోలుకుంటున్నాయి. ముఖ్యంగా 2021 క్యాలెండర్ ఏడాదిలో చాలా క్రిప్టో కరెన్సీలు లాభాలను ఇవ్వగా, మరికొన్ని క్రిప్టోలు ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో 2022లో వివిధ క్రిప్టోలపై పెట్టుబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో పెట్టుబడి పెట్టడానికి పరిగణించాల్సిన క్రిప్టోలను చూద్దాం.... ఇందులో ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు టెథేర్, బీఎన్బీ, యూఎస్డీ కాయిన్, సోలానా, ఎక్స్‌ఆర్‌పీ, కార్డానో, టెర్రా లూనా, అవాలాంచె వంటివి ఉన్నాయి.

అదిరిపోయే రిటర్న్స్
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ గత ఏడాది ఓ సమయంలో 69,000 డాలర్లను తాకింది. అయితే కరోనా థర్డ్ వేవ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం 35,000 డాలర్ల స్థాయికి పతనమైంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం 40,000 డాలర్ల పైన ఉంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో క్రిప్టో కరెన్సీలు అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి.
2021లో ఎత్తుపల్లాల కారణంగా భారీ రిటర్న్స్ ఇస్తూ, అదే స్థాయిలో నష్టాలను కూడా మిగిల్చాయి. అయితే బిట్ కాయిన్, ఎథేరియం వంటి దిగ్గజ క్రిప్టోలు మాత్రం పూర్తి ఏడాదికి 50 శాతం వరకు కూడా రిటర్న్స్ ఇచ్చాయి. 2021 జనవరిని 32,000 డాలర్ల వద్ద ప్రారంభించిన బిట్ కాయిన్, 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి 47,000 డాలర్లను క్రాస్ చేసింది. అంటే 50 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చింది.

బిట్ కాయిన్, ఎథేరియం
బిట్ కాయిన్ ప్రస్తుతం 40,079 డాలర్ల వద్ద ఉంది. ఇది గత ఏడాది ఓ సమయంలో 69,000 డాలర్లను క్రాస్ చేసింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3055 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 2021 జనవరిలో 775 డాలర్ల వద్ద ఉన్న ఎథేరియం ఇప్పుడు 3000 డాలర్లకు పైన ఉంది.
అయితే నవంబర్ నెలలో 4700 డాలర్లను చేరుకుంది. డిసెంబర్ 31, 2021 నాటికి 3,700 డాలర్లకు పైన ముగిసింది. టెథేర్, బియాన్స్ కాయిన్, యూఎస్‌డీ కాయిన్.. ఈ క్రిప్టోలు కూడా దాదాపు 2021 పూర్తి క్యాలెండర్ ఏడాదికి మంచి రిటర్న్స్ ఇచ్చాయి.

ఇవి కూడా
అందరికీ బాగా తెలియని క్రిప్టోల విషయానికి వస్తే లక్కీ బ్లాక్, డీసెంట్రలాండ్, మీమ్ కాయిన్ షిబా ఇను, యాక్సీ ఇన్ఫినిటీ, పాలీగోన్, అవాలాంచె, రిప్పిల్, స్టెల్లార్, కర్వ్ వంటి క్రిప్టోలు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి.


Click it and Unblock the Notifications