ప్రభుత్వం లేదా ప్రయివేటు/ప్రభుత్వరంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్స్‌కు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. సీనియర్ సిటిజన్స్ ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఎక్కువగా ఆధారపడతారు. అందుకే వివిధ బ్యాంకులు సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే కాస్త ఎక్కువగా ఇస్తాయి. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం కూడా పలు ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పెట్టుబడిపై వారు మంచి రిటర్న్స్ పొందవచ్చు. తద్వారా స్వయం సమృద్ధితో ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు మంచి స్కీమ్స్‌ను ఇక్కడ చూడండి.

సీనియర్ సిటిజన్స్‌కు ఆర్థిక మద్దతు
సీనియర్ సిటిజన్ సెల్ఫ్ రెసిస్టాన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చింది. ఈ వివిధ పథకాల ద్వారా సీనియర్ సిటిజన్లకు మెరుగైన రాబడులు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీ సంపాదించవచ్చు. తద్వారా ఆర్థిక మద్దతు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ పరిగణలోకి తీసుకోవాల్సిన మూడు మంచి స్కీమ్స్ ఇక్కడ చూడండి...

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం కాలవ్యవధి అయిదు సంవత్సరాలు. ఇక్కడ రూ.1000 నుండి రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా తెరుచుకునే వెసులుబాటు ఉంది. దీనిపై రాబడి 7.4 శాతంగా ఉంది. ఈ స్కీం మెచ్యూరిటీ కాలపరిమితి అయిదేళ్లు. అరవై ఏళ్లకు పైబడిన వారందరికీ ఈ స్కీం వర్తిస్తుంది.

ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం
సీనియర్ సిటిజన్స్ ఉత్తమ పెట్టుబడులలో ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) ముఖ్యమైనది. ఇందులో సీనియర్ సిటిజన్లకు అరశాతం వడ్డీ అదనంగా ఉంటుంది. అంటే ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. మీ సౌలభ్యం ప్రకారం వాటిని సరిపోల్చుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు కూడా పన్నురహితంగా ఉంటుంది. వివిధ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో ప్రత్యేక FDలను ప్రారంభిస్తాయి.
సీనియర్ సిటిజన్స్ కోసం వివిధ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ వడ్డీ రేటు కంటే 0.50 శాతం అధికంగా ఉంటాయి. ఇటీవల ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC వంటి బ్యాంకులు మరో అర శాతం అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే ఇవి అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధితో ఉంటాయి.

ప్రధానమంత్రి వయ వందన యోజన
ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీంను అరవై ఏళ్లు నిండిన వారు తీసుకోవచ్చు. ఇందులో ప్రతి సంవత్సరం వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ఈ పథకంలో గరిష్టంగా రూ.15 లక్షల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. పాలసీ వ్యవధి వరకు పెట్టుబడిదారు సజీవంగా ఉంటే స్కీంలో పెట్టుబడి పెట్టిన డబ్బు పెన్షన్ ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు తిరిగి వస్తుంది. పెట్టుబడిదారు మరణించిన సమయంలో నామినీకి నగదు వస్తుంది.
More From GoodReturns

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గేనా?

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గే అవకాశం!

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications