సాధారణంగా మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD) ఎక్కువగా నమ్ముతుంటారు. కానీ, గత కొన్ని నెలలుగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు, బ్యాంకు ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే కొన్ని అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో వడ్డీ ప్రతి ఆరు నెలలకోసారి 'కాంపౌండ్' (చక్రవడ్డీ) అవుతూ మీ సంపదను పెంచుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

1. సుకన్య సమృద్ధి యోజన (SSY)
మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఆమె భవిష్యత్తు కోసం ఇంతకంటే మంచి పథకం మరొకటి లేదు. ఇది కేవలం సేవింగ్స్ స్కీమ్ మాత్రమే కాదు, ఒక గొప్ప సెంటిమెంట్ కూడా.
- వడ్డీ రేటు: ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తోంది. ఇది సాధారణ బ్యాంకు ఎఫ్‌డీల కంటే చాలా ఎక్కువ.
- పెట్టుబడి: ఏడాదికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు దాచుకోవచ్చు. 15 ఏళ్ల పాటు డబ్బులు కడితే.. 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అందుతుంది.
- ట్యాక్స్ బెనిఫిట్: ఇందులో మనం పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సొమ్ము.. ఈ మూడింటిపై రూపాయి కూడా పన్ను (Tax) కట్టాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల ఉన్నత చదువులకు లేదా పెళ్లి ఖర్చులకు ఇది ఒక పక్కా ప్లాన్.
2. RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్
చాలామందికి ఈ బాండ్ల గురించి పెద్దగా తెలియదు. కానీ, ఇవి అత్యంత సురక్షితమైనవి. దీనికి స్వయంగా భారత ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.
- ప్రత్యేకత: ఈ బాండ్ల వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకోసారి మారుతూ ఉంటుంది (Reset అవుతుంది). సాధారణంగా ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) రేటు కంటే 0.35% ఎక్కువగా ఉంటుంది.
- వడ్డీ: ప్రస్తుతం ఇందులో 8.05% వరకు వడ్డీ లభిస్తోంది. ప్రతి ఆరు నెలలకోసారి వడ్డీ డబ్బులు నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లో పడతాయి.
- పరిమితి: ఇందులో కనీసం రూ. 1,000 నుండి ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే దీని ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
సురక్షితమైన పెట్టుబడికి నిలువుటద్దం ఈ పీపీఎఫ్. ఇది కేవలం ఉద్యోగులకే కాదు, సామాన్యులు కూడా బెస్ట్ సేవింగ్ స్కీమ్ (Saving scheme) దీని ద్వారా మంచి వడ్డీ పొందొచ్చు.
- లాభాలు: ప్రస్తుతం దీనిపై 7.1% వడ్డీ రేటు ఉంది. 15 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి భారీ నిధి సమకూరుతుంది.
- లెక్క ఇలా: మీరు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే.. మీరు కట్టేది రూ. 22.5 లక్షలు. కానీ, చక్రవడ్డీ పుణ్యమా అని మెచ్యూరిటీ నాటికి మీకు సుమారు రూ.42 నుండి రూ. 43 లక్షల వరకు అందుతాయి.
- ట్యాక్స్ ఫ్రీ: సుకన్య సమృద్ధి లాగే ఇందులో కూడా మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి పన్ను ఉండదు.
మొత్తంగా చెప్పాలంటే.. మీరు లాంగ్ టర్మ్ లో సంపద సృష్టించుకోవాలనుకుంటే ఈ మూడు పథకాలు బ్యాంకు ఎఫ్‌డీల కంటే మెరుగైన ఆప్షన్లు. ముఖ్యంగా రిస్క్ తీసుకోకూడదు అనుకునేవారికి ఇవి ఒక వరం లాంటివి. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన పథకాన్ని ఎంచుకుని ఈరోజే పొదుపు ప్రారంభించండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications