బంగారం కొనాలా లేక స్టాక్స్‌లో పెట్టాలా? ChatGPT ఇచ్చిన రిప్లై చూసి నెటిజన్లు షాక్!
నేటి కాలంలో యువత కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. కానీ అదే స్థాయిలో స్టూడెంట్ లోన్లు, అధిక ఖర్చులు కూడా వెంటాడుతున్నాయి. తాజాగా ఒక 22 ఏళ్ల యువకుడు తనకు ఎదురైన ఆర్థిక సందిగ్ధాన్ని ChatGPT ముందు ఉంచాడు. తనకు బెంగళూరు (Bengaluru) లో రూ. 15 లక్షల ప్యాకేజీ ఉందని, నెలకు రూ. 40 వేల ఖర్చులు పోగా.. రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఉందని చెప్పాడు. మరి తను SIP, డైరెక్ట్ స్టాక్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అని అడిగిన ప్రశ్నకు AI చాలా ప్రాక్టికల్ , షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

లోన్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్: ఏది ముఖ్యం?
సాధారణంగా ఎవరికైనా అప్పు ఉంటే ముందు దాన్ని తీర్చాలని అనుకుంటారు. కానీ AI ఇక్కడ ఒక స్మార్ట్ పాయింట్ చెప్పింది. మీ స్టూడెంట్ లోన్ వడ్డీ రేటు సుమారు 9-11% ఉంటే, మ్యూచువల్ ఫండ్లలో చేసే SIP దీర్ఘకాలంలో 12-15% వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే, అప్పు తీర్చడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభం గణితశాస్త్ర పరంగా ఎక్కువే. కానీ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది, లోన్ వడ్డీ మాత్రం గ్యారెంటీగా కట్టాల్సిందే. అందుకే AI ఒక మధ్యేమార్గాన్ని సూచించింది.
చక్రవడ్డీ (Compounding) మ్యాజిక్
మీరు కేవలం అప్పు తీర్చడానికే ప్రాధాన్యత ఇచ్చి, మీ మిగులు ఆదాయాన్ని (సుమారు రూ. 80-85 వేలు) పూర్తిగా లోన్‌కే కేటాయిస్తే.. మీరు అప్పు నుంచి త్వరగా విముక్తి పొందుతారు కానీ, ఆ ఏడేళ్ల విలువైన 'సమయాన్ని' కోల్పోతారు. 22 ఏళ్ల వయసులో సమయమే మీ అతిపెద్ద పెట్టుబడి.
AI లెక్కల ప్రకారం..
ఒకవేళ మీరు నెలకు రూ. 40,000 చొప్పున 25 ఏళ్ల పాటు SIP చేస్తే, 11% వార్షిక రిటర్న్స్‌తో మీ ఫ్యూచర్ వాల్యూ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుంది. అదే మీరు పెట్టుబడిని వాయిదా వేసి లోన్ తీర్చడంపైనే దృష్టి పెడితే, మీరు పొందే వడ్డీ ఆదా కేవలం కొన్ని లక్షలు మాత్రమే. అంటే కోట్లు గడించే అవకాశాన్ని కొన్ని లక్షల కోసం వదులుకోవద్దని AI హెచ్చరించింది.
పోర్ట్‌ఫోలియోను ఎలా బ్యాలెన్స్ చేయాలి?
కేవలం పెట్టుబడి పెట్టి అప్పును వదిలేయడం కూడా తెలివైన పని కాదు. అందుకే ఈ క్రింది ప్లాన్‌ను AI రికమెండ్ చేసింది..
- ఎమర్జెన్సీ ఫండ్: ముందుగా 6 నెలల ఖర్చులకు సరిపడా రూ. 2.5 - 3 లక్షలు పక్కన పెట్టండి.
- SIP (మ్యూచువల్ ఫండ్స్): నెలకు రూ. 30,000 - 40,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. ఇది మీ దీర్ఘకాలిక సంపదను పెంచుతుంది.
- లోన్ ప్రీ-పేమెంట్: నెలకు రూ. 10,000 - 15,000 అదనంగా లోన్ కోసం కట్టండి. దీనివల్ల లోన్ కాలపరిమితి 2-3 ఏళ్లు తగ్గి, వడ్డీ భారం తగ్గుతుంది.
- డైరెక్ట్ స్టాక్స్: మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే, ఒక రూ. 5,000 - 10,000 డైరెక్ట్ స్టాక్స్ కోసం కేటాయించవచ్చు.
మొత్తంగా చెప్పేదేంటంటే.. అప్పులు లేకుండా హాయిగా ఉండాలా? లేక రిస్క్ తీసుకుని ఇన్వెస్టర్ అవ్వాలా? అనే ఆప్షన్ల మధ్య కొట్టుమిట్టాడకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. చిన్న వయసులో చేసే చిన్న SIP కూడా భవిష్యత్తులో పెద్ద ఆస్తిగా మారుతుంది. అప్పును అదుపులో ఉంచుకుంటూనే, మార్కెట్ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని AI సూచించింది. ఈ స్ట్రాటజీని ఫాలో అయితే అప్పులు తీరడమే కాకుండా, మీరు రిటైర్ అయ్యే సమయానికి కోటీశ్వరులు అవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications