సాధారణంగా ప్రతి ఒక్కరి దీర్ఘకాల లక్ష్యం ఇంటి నిర్మాణం లేదా ఇంటిని కొనుగోలు చేయడం. ఇంటి కొనుగోలు లక్షలతో కూడిన వ్యవహారం. ఒకేసారి అంతమొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో చాలామంది ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకుంటారు. హోమ్ లోన్ తీసుకుంటే ఇంటిని సొంతం చేసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.
ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను మినహాయింపు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, టాప్ అప్ వంటి వివిధ ప్రయోజనాలు ఉంటాయి. వాటితో పాటు కో-అప్లికెంట్‌ను చేర్చుకోవచ్చు. అలాగే మహిళలకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. మన ఆదాయాన్ని బట్టి ఈఎంఐ సౌకర్యాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది.

హోమ్ లోన్ పైన చెల్లించే వడ్డీకి ప్రతి సంవత్సరం రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24బీ కింద ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అలాగే సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. రుణం మనకు భారంగా మారుతుందనుకుంటే కో-అప్లికెంట్‌ను చేర్చుకునే వెసులుబాటు ఉంది. హోమ్ లోన్ కోసం మహిళలు సహదరఖాస్తురాలిగా ఉంటే కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
హోమ్ లోన్ కింద ఓవర్ డ్రాఫ్ట్ వసతిని పొందే అవకాశం ఉంటుంది. తరుచూ నగదు అవసరం ఉండేవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి వడ్డీ లేకుండా గడువు తీరేలోగా తిరిగి చెల్లించవచ్చు. ఓడీ ద్వారా తీసుకున్న మొత్తాన్ని తిరిగి హోమ్ లోన్ చెల్లింపుకు ఉపయోగించుకోవచ్చు. అత్యవసరమైతే హోమ్ లోన్ పైన టాప్-అప్ లోన్ తీసుకోవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications