ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో అపారమైన సంపద ఉండాలని, కనీసం ఒక కోటి రూపాయలైనా వెనకేయాలని కోరిక ఉంటుంది. కానీ, లక్షల్లో జీతం వచ్చే వారికి కూడా కోటి రూపాయల ఆస్తి ఉండటం ఈ రోజుల్లో కష్టంగా మారింది. పెరుగుతున్న ఖర్చులు, సరైన పెట్టుబడి ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. అయితే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచించే ఒక అద్భుతమైన 15x15x15 ఫార్ములా ద్వారా మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు. ఇదెలా ఉంటుందంటే..

ఏమిటి ఈ 15x15x15 ఫార్ములా?
ఈ ఫార్ములా చాలా ఈజీ. దీన్ని అప్లై చేయడం తెలిస్తే.. మీరు కూడా కోటీశ్వరులు అవ్వొచ్చు. ఈ ఫార్ములాలో మూడు ముఖ్యమైన '15'లు ఉంటాయి.
- మీరు ప్రతి నెలా రూ. 15,000 పొదుపు చేయాలి.
- ఈ మొత్తాన్ని వరుసగా 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి (SIP రూపంలో).
- మీ పెట్టుబడిపై ఏడాదికి సగటున 15% రిటర్న్స్ రావాలి.
ఈ మూడు కలిస్తే 15 ఏళ్ల తర్వాత మీ చేతిలో ఉండే మొత్తం అక్షరాలా రూ. కోటి! నిజమే.. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ అందించే కాంపౌండింగ్ పవర్ (Power of Compounding) వల్ల ఇది సాధ్యమే.
నిజంగా 15% రిటర్న్స్ వస్తాయా?
చాలా మందికి వచ్చే సందేహం ఇదే. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్స్ అనేవి మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి. మరి 15% శాతం రిటర్న్స్ సాధ్యమేనా? అంటే.. సాధ్యమే అంటున్నారు నిపుణులు. 2010 నుంచి ఇప్పటివరకు చాలా మ్యూచువల్ ఫండ్స్ 12% నుండి 18% వరకు సగటు వార్షిక రిటర్న్స్ (CAGR) ఇచ్చాయి. మీరు గానీ దీర్ఘకాలం (15 ఏళ్లు) పెట్టుబడి పెట్టినప్పుడు 15% రిటర్న్స్ ఆశించడం అసాధ్యమేమీ కాదు. అయితే మీరు సరైన ఫండ్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ తగ్గితే?
ఒకవేళ మీకు 12% రిటర్న్స్ మాత్రమే వచ్చాయి అనుకుందాం. అప్పుడు 15 ఏళ్ల తర్వాత మీ దగ్గర సుమారు రూ. 75 లక్షలు ఉంటాయి. అదే 10% వస్తే ఆ మొత్తం ఇంకా తగ్గుతుంది. అప్పుడు మీరు రూ. కోటి కోసం మరో రెండు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది.
పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి..
మీరు కోటీశ్వరులు కావాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడే మీ గోల్స్, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ పెరిగినా, తగ్గినా మీ SIP ని ఆపకుండా 15 ఏళ్ల పాటు కొనసాగించాలి. ఒకటి రెండు ఏళ్లలో భారీ లాభాలు ఆశించడం కంటే.. 10-15 ఏళ్ల కాలపరిమితి పెట్టుకోవడం ఉత్తమం. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
గుర్తుంచుకోండి.. కోటి రూపాయలు అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఒక కల. కానీ ఈ 15x15x15 సూత్రంతో ఆ కలను నిజం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే చిన్న మొత్తంతో మొదలుపెట్టి, మీ భవిష్యత్తును ఆర్థికంగా పటిష్టం చేసుకోండి!
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు. మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications