నెలకు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంతో మీ పేటీఎం వ్యాలెట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి మాత్రమే కాకుండా పేటీఎం నుంచి కూడా ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. అలా చేసేవారు ఇక నుంచి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1, 2020 నుంచి పేటీఎం ట్రాన్సాక్షన్ విషయంలో మార్పు చేసింది.

రూ.10,000 కంటే ఎక్కువ ఫిల్ చేస్తే 2 శాతం
మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వ్యాలెట్‌ను రూ.10,000 కంటే ఎక్కువ ఫిల్ చేస్తే 2 శాతం ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే డెబిట్ కార్డులు లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగిస్తే మాత్రం ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ క్రెడిట్ కార్డుల పేటీఎం నుంచి డబ్బు తీసుకునే వారికి మాత్రం ఇది షాక్.

ఎందుకు ఇలా?
క్రెడిట్ కార్డు యూజర్లు కొంతమంది తమ డబ్బును పేటీఎం వ్యాలెట్‌కు పంపించుకొని, అటు నుంచి బ్యాంకు అకౌంటుకు ట్రాన్సుఫర్ చేసుకుంటున్నట్లుగా పేటీఎం గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు లేదా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ మొత్తానికి క్రెడిట్ కార్డు యూజర్లు నలభై రోజుల వడ్డీరహిత కాలాన్ని వినియోగించుకుంటున్నారు.

ఇప్పుడు మరోసారి...
క్రెడిట్ కార్డు ఫండ్ ట్రాన్సుఫర్‌కు పేటీఎం ఇలా ఛార్జ్ విధించడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి వాటిపై 2 శాతం ఛార్జీ విధించనున్నట్లు 2017 మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తీసుకు వచ్చింది. అదే సమయంలో మొబిక్విక్ మాత్రం ఫండ్స్ లోడింగ్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.

చార్జ్ ఎలా ఎలా వర్తిస్తుంది?
రూ.10,000 ఆ పైన లోడ్ చేసుకుంటే ఛార్జ్ ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎంలోకి రూ.15,000 ట్రాన్సుఫర్ చేస్తే 2 శాతం చొప్పున రూ.300 పేటీఎంకు ఛార్జ్ చెల్లించవలసి ఉంటుంది. అయితే మీరు వీటిని వేర్వేరుగా పంపించుకుంటే మాత్రం ఛార్జీ ఉండదు. రూ.3,000 ఓసారి, రూ.4,000 ఓసారి, రూ.3,000 ఓసారి పంపిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. కానీ చివరి ట్రాన్సాక్షన్‌లో రూ.1 జోడించినా అంటే రూ.3,001 అయితే అప్పుడు ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే రూ.10,000 దాటుతుంది.

ఎక్కువమందిపై ప్రభావం ఉండదు
ఈ నిర్ణయంతో ఎక్కువ మంది యూజర్లపై ప్రభావం పడదని, రోజువారీ ఖర్చులు, రవాణా ఖర్చులు, యుటిలిటీ బిల్లుల వంటి వాటి కోసం రోజుకు రూ.10,000 సరిపోతుందని, అందుకే చాలామంది యూజర్లపై ప్రభావం పడదని చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications