October Bank Holidays: ప్రతినెల మాదిరిగానే దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల్లోని బ్యాంకులు కొన్ని రోజులు అక్టోబరులో సైతం సెలవులో ఉండనున్నాయి. ఈ క్రమంలో ఏఏ రాష్ట్రాల్లో ఏ తేదీల్లో బ్యాంకులకు హాలిడే ఉంటుందనే విషయాలను బ్యాంక్ ఖాతాదారులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారు తమ బ్యాంక్ విజియ్ ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.
రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరులో భారతీయ బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితా తప్పకుండా తెలుసుకోవాల్సిందే. పండుగల సీజన్ తో పాటు జాతీయ ఈవెంట్స్ కారణంగా ఈ సెలవులు గుర్తించబడతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దేశంలోని బ్యాంక్ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు వీటి వివరాలను ప్రతినెల తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 2024లో ముఖ్యమైన సెలవుల జాబితా..
అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సార్వత్రిక ఎన్నికల కారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
అక్టోబరు 2: మహాత్మా గాంధీ జయంతి- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబరు 3: జైపూర్‌లో నవరాత్రి ఉత్సవాలు రోజు బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 5: ఆదివారం సెలవు
అక్టోబర్ 10: దుర్గా పూజ/దసరా సందర్భంగా అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులు క్లోజ్.
అక్టోబర్ 11: దసరా పండుగకు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, రాంచీతో సహా పలు నగరాల్లోని బ్యాంకులకు హాలిడే.
అక్టోబరు 12: రెండవ శనివారం సెలవు
అక్టోబర్ 13: ఆదివారం సెలవు
అక్టోబర్ 14: దుర్గా పూజ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు సెలవు
అక్టోబర్ 16: లక్ష్మీ పూజ అగర్తల, కోల్‌కతాలో బ్యాంకింగ్ హాలిడే
అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి, కటి బిహు బెంగళూరు, గౌహతి, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 20: ఆదివారం బ్యాంక్ హాలిడే
అక్టోబర్ 26: నాల్గవ శనివారం సెలవు.
అక్టోబర్ 27: ఆదివారం సెలవు
అక్టోబర్ 31: దీపావళి, కాళీ పూజ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టినరోజు పండుగ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
పండుగలతో పాటు ఇతర కారణాల కారణంగా దేశీయంగ్ బ్యాంకులు సెలవులో మూసివేసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, మెుబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు అందుబాటులోనే ఉంటాయి. అయితే ఏదానా రుణానికి సంబంధించిన లేదా ఇతర బ్యాంక్ పనులను పూర్తి చేయాలంటే తప్పకుండా అందుకోసం సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు తప్పక వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మాత్రం పైన పేర్కొన్న సెలవులకు అనుగుణంగా బ్యాంక్ విజిట్ ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఇది ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తుందని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications