Fixed Deposits: ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు తర్వాత సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంక

బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. ఈ ప్రకటన తర్వాత బ్యాంకులు కాలక్రమేణా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు RBI విధాన మార్పు జరిగిన కొద్ది రోజుల్లోనే FD రేట్లను సవరిస్తాయని అంచనా వేస్తున్నారు. మరికొన్ని బ్యాంకులు తమ నిధుల అవసరాలు, నగదు లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాల పాటు వేచి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రముఖ ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

మిగతా ఎన్బీఎఫ్సీలు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు 3, 5 సంవత్సరాల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పరిశీలిద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాల FDపై అత్యధికంగా 7.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ పై 6.8 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాల FDపై 6.80% వడ్డీని అందిస్తోంది. ఇదే కాలానికి కెనరా బ్యాంక్ 6.7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా చెరో 6.75% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

Bank FD

5 సంవత్సరాల FD విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 7.05% వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.90% వడ్డీని అందిస్తుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.85% వడ్డీని అందిస్తోంది. కెనరా బ్యాంక్ 6.75% వడ్డీని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 6.60% వడ్డీని అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులలో, బంధన్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ యెస్ బ్యాంక్ 3 సంవత్సరాల FDపై 7.75% చొప్పున వడ్డీ రేటును అందిస్తున్నాయి. RBL బ్యాంక్ 7.70 శాతం వడ్డీని, SBM బ్యాంక్ ఇండియా 3 సంవత్సరాల FDపై 7.60% వడ్డీని చెల్లిస్తున్నాయి. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై DCB బ్యాంక్ అత్యధికంగా 8.00% వడ్డీ రేటును అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంక్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 7.25% చొప్పున వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.15% వడ్డీని అందిస్తోంది. ICICI బ్యాంక్ 5 సంవత్సరాల FDపై 7.10% వడ్డీ రేటును చెల్లిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FD పై అత్యధికంగా 8.30% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. దాని తర్వాత ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.75%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70%, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25% వడ్డీని అందిస్తున్నాయి.

5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జాబితాలో ఉన్న బ్యాంకులలో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 8.50% వడ్డీ రేటును చెల్లిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం అందిస్తుండగా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70% ఆఫర్ చేస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం చొప్పున వడ్డీ అందిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+