Fixed Deposits: సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందించే బ్యాంకులు ఇవే..!
చాలా మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియదు. కచ్చితమైన, సురక్షితమైన రాబడి ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉత్తమ ఎంపికగా ఉంటాయి. అయితే ఏ బ్యాంకులు వడ్డీ రేటు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికమైన ఈ రేటును బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. పన్నుకు ముందు, చక్రవడ్డీ కలపకుండా రూ.1 లక్షకు సంవత్సరానికి రూ.7,450 వడ్డీ వస్తుంది. ఇదే లెక్క ప్రకారం రూ.5 లక్షలకు సంవత్సరానికి రూ.37,250 రానుంది.అయితే ప్రకటించిన అత్యధిక రేటు ప్రతి డిపాజిట్ కాలానికి వర్తించదు.
సీనియర్ సిటిజన్లకు అత్యధిక FD రేట్లు అందించే బ్యాంకుల్లో పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7.35 వడ్డీ రేట్ అందిస్తోంది. దీని ప్రకారం రూ.1 లక్షకు రూ.7,350 వడ్డీ చెల్లిస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ 7.25శాతం చొప్పున వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఈవరేటు ప్రకారం రూ.1 లక్షకు సంవత్సరానికి రూ.7,250 వస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇండియన్ బ్యాంక్ గరిష్టంగా 7.15 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక్కొక్కటి 7.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వడ్డీని చెల్లిస్తోన్నాయి.

యూకో బ్యాంక్ అత్యల్పంగా గరిష్ట వడ్డీ రేటును 6.95 శాతం చెల్లిస్తోంది. ఒక సంవత్సరం డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. రూ.1 లక్ష డిపాజిట్‌పై, చక్రవడ్డీ లేకుండా పన్నుకు ముందు రూ.7,000 వడ్డీ అందిస్తోంది. ఒక సంవత్సరానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో రూ.లక్ష డిపాజిట్ చేస్తే రూ.6,900 రాబడి వస్తుంది. ఇదే కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక బ్యాంకులు ఒక సంవత్సరానికి 6.75 శాతం వడ్డీ అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఈ రేటును అందిస్తున్నాయి. పంజాబ్ & సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అత్యల్ప వార్షిక వడ్డీ రేటును 6.35% వద్ద అందిస్తున్నాయి.
ఐదు సంవత్సరాలకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. రూ.1 లక్ష ఐదు సంవత్సరాలలో రూ.35,250 వడ్డీ చెల్లిస్తారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐదు సంవత్సరాలకు 5.50% అందిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
