Bank Holidays: వచ్చే వారం నాలుగు రోజులు మూతపడనున్న బ్యాంకులు..!

ఆర్థిక లావాదేవీల్లో బ్యాంకుల పాత్ర చాలా కీలకం. ఒకప్పుడు విత్ డ్రా, డిపాజిట్, ట్రాన్స్ ఫర్ చేయడం కోసం బ్యాంకు వెళ్లాల్సి వచ్చింది. కానీ పరిస్థితి మారింది. అంతా డిజిటల్ అయిపోయింది. యూపీఐ చెల్లింపులు పెరిగిపోయాయి. అయినప్పటికీ కొన్ని పనులకు బ్యాంకు వెళ్లాల్సింది. చెక్ వేయడం కోసం బ్యాంకు వెళ్లాల్సిందే. కొన్ని రుణాలు తీసుకోవాలన్నా బ్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారు రెగ్యులర్ గా బ్యాంకు వెళ్తారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల సెలవులు గురించి తెలుసుకోవాలి. కాగా వచ్చే వారం బ్యాంకుల పలు దినాల్లో సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 24 నుంచి 30 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడేస్ ఉన్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్‌ ప్రకారం ఈ వారంలో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు సెలవులు ఉంటాయి. వచ్చే వారంలో
బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్నాయి. ఆగస్టు 25 మంగళవారం రోజు మిలాద్‌-ఉన్‌-నబీ, మిలాద్‌-ఇ-షెరీఫ్‌ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. కేరళలో తొలి ఓణం వేడుకల కారణంగానూ బ్యాంకులకు సెలవు ఉండనుంది.

Bank Holidays

ఆగస్టు 26 బుధవారం రోజు ఈద్‌-ఎ-మిలాద్‌, బరావాఫత్‌, మిలాద్‌-ఉన్‌-నబీ, తిరుఓణం వేడుకల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, తెలంగాణ, మణిపూర్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, ఢిల్లీ, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆగస్టు 28, శుక్రవారం రోజు రక్షా బంధన్‌ సందర్భంగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఆగస్టు 30, ఆదివారం రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవుగా ఉంది. కాగా ఆగస్టు 29 శనివారం రోజులు బ్యాంకు ఓపెన్ అయి ఉంటాయి.

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ డిజిటల్ లావాదేవీలు కొనసాగుతాయి. ఎటీఎం విత్ డ్రా, డిపాజిట్లు కూడా కొనసాగుతాయని బ్యాంకులు ప్రకటించాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా 24 గంటలు పని చేస్తాయి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ లావాదేవీ సేవలను కూడా వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+