ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(BoM) తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా కింద హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును లైఫ్ టైమ్ కనిష్టస్థాయి 6.40 శాతానికి తగ్గించింది. ఇప్పటి వరకు వడ్డీ రేటు 6.80 శాతంగా ఉంది. అలాగే కారు రుణాలపై వడ్డీ రేటును 7.05 శాతం నుండి 6.80 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు సోమవారం నుండి అమల్లోకి వస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వర్తిస్తుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. ఇదివరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ వడ్డీ రేట్లను 6.40 శాతానికి తగ్గించింది.
తాము ప్రకటించిన రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా ఆఫర్ తమ కస్టమర్లకు రుణం పైన మరింత సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందని, ఇది కస్టమర్లకు అదనపు ప్రయోజనమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ ఏఎశ్ రాజీవ్ అన్నారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రాఫిట్ రెండు రెట్లు పెరిగి రూ.264 కోట్లకు చేరుకుంది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన వృద్ధి రూ.2,270 కోట్ల నుండి రూ.3700 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ ధర క్రితం సెషన్లో రూ.20.70 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications